మిజోరాంలో మరోసారి భూ ప్రకంపనలు

| Edited By:

Jul 24, 2020 | 5:10 PM

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారితో పాటు.. భారీ వర్షాలు, వరదలు..

మిజోరాంలో మరోసారి భూ ప్రకంపనలు
Follow us on

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారితో పాటు.. భారీ వర్షాలు, వరదలు కురుస్తున్నాయి. అంతేకాదు.. గత కొద్ది రోజులుగా భూకంపాలు ప్రజల్ని గజగజ వణికిస్తున్నాయి. శుక్రవారం నాడు తెల్లవారు జామున జమ్ముకశ్మీర్, మహారాష్ట్రంలో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు ప్రాంతాల్లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

తాజాగా మిజోరాంలో కూడా భూకంపం స్థానిక ప్రజల్ని వణికించింది. శుక్రవారం ఉదయం 11.16 గంటలకు మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. చంపాయికి ఆగ్నేయ దిశగా 29 లకిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక అదే సమయంలో అసోంలోని కర్బీ ప్రాంతంలో రిక్టార్ స్కేలుపై 3.5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది.