ఢిల్లీకి సమీపంలో భూప్రకంపనలు..

|

Jun 04, 2020 | 7:15 AM

ఢిల్లీకి సమీపంలో మరోసారి భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి నోయిడాకు దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ  తెలిపింది. నోయిడాలో నాలుగు కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు వచ్చినట్లుగా గుర్తించారు. గతవారం రోజుల్లోనే ఢిల్లీతోపాటు హర్యానాలోని రోహతక్ కేంద్రాలుగా భూమి కంపించిందని వెల్లడించింది. మే 29న ఒకసారి.. ఇప్పుడు మరోసారి రోహతక్‌లో రావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 12, […]

ఢిల్లీకి సమీపంలో భూప్రకంపనలు..
Follow us on

ఢిల్లీకి సమీపంలో మరోసారి భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి నోయిడాకు దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ  తెలిపింది. నోయిడాలో నాలుగు కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు వచ్చినట్లుగా గుర్తించారు. గతవారం రోజుల్లోనే ఢిల్లీతోపాటు హర్యానాలోని రోహతక్ కేంద్రాలుగా భూమి కంపించిందని వెల్లడించింది. మే 29న ఒకసారి.. ఇప్పుడు మరోసారి రోహతక్‌లో రావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 12, 13 తేదీల్లో కూడా ఢిల్లీలో స్పల్పంగా భూమి కంపించిందని ప్రకటించింది. అయితే ఢిల్లీ కేంద్రంగానే వరుసగా భూప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.