Students: చదువుకుంటూ సంపాందించేలా విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఎలా అంటే

దేశంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ తమ పిల్లలను చదివించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందేలా త్వరలోనే ఓ కొత్త పథకం ప్రారంభం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో 'నేర్చుకుంటూనే సంపాదించండి' అనే పథకాన్ని అమలుచేయనున్నారు.

Students: చదువుకుంటూ సంపాందించేలా విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఎలా అంటే
Students

Updated on: Apr 20, 2023 | 9:35 AM

దేశంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ తమ పిల్లలను చదివించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందేలా త్వరలోనే ఓ కొత్త పథకం ప్రారంభం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ‘నేర్చుకుంటూనే సంపాదించండి’ అనే పథకాన్ని అమలుచేయనున్నారు. దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కుటంబానికి భారం కాకుండా తమ చదువులు కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బులను సంపాదించగలుగుతారని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లోని వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పించడానికి వీలుగా సంబంధిత ప్రతిరపాదనలను యూజీసీ రూపొందించింది.

అయితే పథకం ప్రకారం వారానికి 20 గంటల పాటు నెలలో 20 రోజులు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించేలా, అందుకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని నిర్ణయిస్తూ ముసాయిదా మార్గదర్శకాలను యూజీసీ తయారు చేసింది. విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు వీలు కల్పించే జాబితాలో రీసెర్చ్‌ ప్రాజెక్టులకు సహాయం అందించడం, గ్రంథాలయాల్లో పనులు చేయడం, కంప్యూటర్‌ సేవలు, డేటా ఎంట్రీ, ప్రయోగశాలల్లో చేయూతనందించడం లాంటివి వంటివి ఉన్నాయి. అయితే దీనికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి వంతుల వారీగా ఆయా పనులు కేటాయించనున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us