Monsoon: ముందస్తుగానే పలకరించనున్న రుతుపవనాలు.. ఈనెల 14 నుంచే అండమాన్‌కు ఎంట్రీ!

Monsoon Alert: రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. ఎందుకంటే ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 14 నుంచి 16 మధ్య ఇవి అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్పింది.

Monsoon: ముందస్తుగానే పలకరించనున్న రుతుపవనాలు.. ఈనెల 14 నుంచే అండమాన్‌కు ఎంట్రీ!
Early Monsoon Arrival

Updated on: May 02, 2026 | 9:38 AM

Monsoon Alert: దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే భారత్‌ను పలకరించనున్నాయి. మే 14 నుంచి 16వ తేదీల మధ్యే ఇవి అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

మే నెలలో వాతావరణం ఇలా ఉండబోతోంది:

  1. అధిక వర్షపాతం: మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ), పశ్చిమ భారతంలో వర్షాలు దండిగా కురిసే అవకాశం ఉంది.
  2. తక్కువ వర్షాలు ఎక్కడంటే: ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ పేర్కొంది.
  3. రాత్రి వేళల్లోనూ సెగలు: ఈసారి మే నెలలో పగటిపూటే కాదు, రాత్రి సమయాల్లో కూడా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండొచ్చు.
  4. ఉక్కపోతతో జాగ్రత్త: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో సముద్రపు తేమ వల్ల ఉక్కపోత (Humid heat) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు మరింత అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
  5. ఇవి కూడా చదవండి

ముందస్తు రుతుపవనాల రాకతో ఎండల తీవ్రత నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది వానాకాలం కాస్త త్వరగానే మొదలుకానుంది. మే నెల మధ్యలోనే రుతుపవనాల ప్రయాణం మొదలవనుండటంతో ఎండల సెగ నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తీర ప్రాంతాల ప్రజలు ఉక్కపోత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇక నుంచి అలా చేస్తే కుదరదు.. మరింత కఠినతరం!

ఇది కూడా చదవండి: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Follow Us