తాగిన మైకంలో భార్యను కడతేర్చాడు…

మద్యం మత్తులో క్షణికావేశానికి ఓ నిండి ప్రాణం బలైంది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్యను కాటికి పంపాడు ఓ తాగుబోతు భర్త. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  బరేలీకి చెందిన అజయ్‌కి పింకీ అనే మహిళతో ఎనిమిది యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొద్ది సంవత్సరాలుగా వీరు పింకీ పుట్టింటి వద్దే ఉంటోంది. గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన వచ్చిన అజయ్‌ భార్యతో గొడవపడ్డాడు. గొడవ పెద్దదవటంతో ఆమె నోటిలో […]

తాగిన మైకంలో భార్యను కడతేర్చాడు...

Updated on: May 15, 2020 | 3:51 PM

మద్యం మత్తులో క్షణికావేశానికి ఓ నిండి ప్రాణం బలైంది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్యను కాటికి పంపాడు ఓ తాగుబోతు భర్త. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  బరేలీకి చెందిన అజయ్‌కి పింకీ అనే మహిళతో ఎనిమిది యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొద్ది సంవత్సరాలుగా వీరు పింకీ పుట్టింటి వద్దే ఉంటోంది. గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన వచ్చిన అజయ్‌ భార్యతో గొడవపడ్డాడు. గొడవ పెద్దదవటంతో ఆమె నోటిలో గుడ్డకుక్కి దాడి చేశాడు. కత్తితో ఆమె గుండెల్లో పొడిచి, ఇటుకతో తలపై కొట్టాడు. దీంతో పింకీ అక్కడిక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.
ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న వారి ఇద్దరి పిల్లలు తండ్రి బట్టలకు అంటుకున్న రక్తపు మరకలు గమనించారు. అనుమానంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా తల్లి మరణించి ఉంది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న అజయ్‌ కోసం గాలిస్తున్నారు. అయితే పింకీ, అజయ్‌ల మధ్య ప్రాణాలు తీసుకునేంత గొడవలేమీ లేవని మృతురాలి తండ్రి ద్రిగ్‌పాల్‌ చెప్పారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us