అమెరికాలో వ్యక్తి మృతికి కారణమైన కంటి చుక్కల మందుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. ఆ కంపెనీలో సోదాలు..

|

Feb 04, 2023 | 2:46 PM

తమిళనాడు లోని గ్లోబల్‌ ఫార్మాలో డ్రగ్‌ అథారిటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమెరికాలో ఈ సంస్థ తయారు చేసిన కంటి చుక్కల మందు వాడి చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. గ్లోబల్‌ ఫార్మా తయారు చేసిన ఎజ్రీకార్‌ వాడిన వాళ్లను 55 మంది అస్వస్థతకు...

అమెరికాలో వ్యక్తి మృతికి కారణమైన కంటి చుక్కల మందుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. ఆ కంపెనీలో సోదాలు..
Global Pharma Healthcare
Follow us on

తమిళనాడు లోని గ్లోబల్‌ ఫార్మాలో డ్రగ్‌ అథారిటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమెరికాలో ఈ సంస్థ తయారు చేసిన కంటి చుక్కల మందు వాడి చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. గ్లోబల్‌ ఫార్మా తయారు చేసిన ఎజ్రీకార్‌ వాడిన వాళ్లను 55 మంది అస్వస్థతకు గురికాగా ఒకరు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గ్లోబల్‌ ఫార్మాలో డ్రగ్‌ అథారిటీ అధికారులు సోదాలు చేశారు.

ఎజ్రీకేర్‌ తయారీకి వాడుతున్న పదార్ధాల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అమెరికాలో 12 రాష్ట్రాల్లో ఈ మందు వాడిన వాళ్లు అస్వస్థతకు గురయ్యారు. కంటిలో చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ సోకుతున్నట్టు తెలుస్తోంది. మందు వాడిన ఐదుగురు వ్యక్తులు పూర్తిగా కంటిచూపును కోల్పోయారు. ఎజ్రికేర్‌, డెల్సామ్‌ చుక్కల మందులపై అమెరికాలో ఆంక్షలు విధించారు. దీంతో ఆ మందులను రీకాల్‌ చేసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే న్యూయార్క్‌, వాషింగ్టన్‌తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురికి.. ఈ కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వచ్చింది. వారిలో కొంత మంది కంటిచూపు కోల్పోగా మరి కొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. సుమారు 55 మందిపై ఈ మందు ప్రభావం కనిపించినట్టు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ గుర్తించింది. దీంతో ఆ మందుపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ దీనిపై స్పందించింది. ‘ఎజ్రీకేర్, డెల్సామ్ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫీషియల్ టియర్స్ లూబ్రికెంట్ కంటి చుక్కల మందులను మార్కెట్ నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..