Drones spotted military camps: జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. జమ్మూలోని సైనిక శిబిరాల సమీపంలో బుధవారం కూడా డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూ నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. మిలటరీ కేంద్రాల సమీపంలోనే డ్రోన్లు కనిపించడంతో సైన్యం అప్రమత్తమై.. గస్తిని ముమ్మరం చేసింది.
అయితే.. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి అనంతరం సైన్యం, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. డ్రోన్ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించింది. సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదికను సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలిచ్చిన మరుసటి రోజే డ్రోన్లు కనిపించడం కలకలం రేపుతోంది. గడచిన నాలుగురోజులుగా జమ్మూ నగరంలో మిలటరీ స్థావరాల వద్ద 7 డ్రోన్లు లభించాయి. దీంతో సరిహద్దుల్లో సైనిక గస్తిని ముమ్మరం చేశారు.
Also Read: