DRDO: మరో అద్భుతాన్ని సాకారం చేసిన డీఆర్‌డీఓ.. శత్రువుల నుంచి నౌకలను రక్షించే సరికొత్త పరిజ్ఞానం..

|

Apr 07, 2021 | 9:29 PM

DRDO Developed New Technology: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో అద్భుతాన్ని సాకారం చేసింది. శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకదళ నౌకలను రక్షించుకునేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని...

DRDO: మరో అద్భుతాన్ని సాకారం చేసిన డీఆర్‌డీఓ.. శత్రువుల నుంచి నౌకలను రక్షించే సరికొత్త పరిజ్ఞానం..
Drdo
Follow us on

DRDO Developed New Technology: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో అద్భుతాన్ని సాకారం చేసింది. శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకదళ నౌకలను రక్షించుకునేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో ‘అడ్వాన్స్‌డ్‌ చాఫ్‌ టెక్నాలజీని’ అభివృద్ధి చేసింది.
శత్రువుల నుంచి నౌకలను రక్షించుకునే క్రమంలో అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీని.. డీఆర్‌డీవోకు చెందిన ‘డిఫెన్స్‌ లాబొరేటరీ జోధ్‌పూర్‌’ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగానే షార్ట్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎస్‌ఆర్‌సీఆర్‌), మీడియం రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌సీఆర్‌), లాంగ్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌సీఆర్‌) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. ఈ రాకెట్ల సహాయంతో నౌకదళం మరింత పటిష్టంగా మారుతుంది. ఈ మూడు రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించింది. శత్రు రాడార్‌, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి నౌకలను రక్షించేందుకు చాఫ్‌ పరిజ్ఞాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అధునాత టెక్నాలజీని దేశీయంగా తయారు చేయడం విశేషం. ఇక తక్కువ సమయంలో వీటిని అభివృద్ధి చేసినందకు గాను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్‌ జి.అశోక్‌ కుమార్‌ డీఆర్‌డీవో పరిశోధకులను అభినందించారు.

డీఆర్‌డీఓ చేసిన ట్వీట్‌..

Also Read: HP Chromebook 11A: విద్యార్థులను, యూత్‌ను టార్గెట్ చేస్తూ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ విడుదల.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు..

Corona Lockdown: మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్.. అన్నీ బంద్.. కఠిన ఆంక్షలు అమలు.!

Pariksha Pe Charcha 2021: విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖీ.. ‘పరీక్షా పే చర్చ’ను ఇలా వీక్షించండి