Flash Floods Video: క్లౌడ్‌బరస్ట్‌తో వణికిపోయిన ఢిల్లీ… ఫ్లాష్‌ ఫ్లడ్స్‌తో ప్రజలు అతలాకుతలం

భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకు అక్కడ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ, హర్యానాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్ని...

Flash Floods Video: క్లౌడ్‌బరస్ట్‌తో వణికిపోయిన ఢిల్లీ... ఫ్లాష్‌ ఫ్లడ్స్‌తో ప్రజలు అతలాకుతలం
North Floods

Updated on: Jul 10, 2025 | 10:03 AM

భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకు అక్కడ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ, హర్యానాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. భారీ వర్షానికి హర్యానాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, అండర్‌పాస్‌లతోపాటు వీధులన్నీ నీటి మునగడంతో ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం బాధలు వర్ణణాతీతంగా మారాయి

కేవలం గంట అంటే గంటపాటు కురిసిన వర్షానికి దేశ రాజధాని కకావికలమైంది. క్లౌడ్‌బరస్ట్‌తో కుండపోత వర్షం కురిసింది.. దాంతో, అనేక ప్రాంతాలు నీట మునిగాయిజ భారీ వర్షానికి ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ గురుగ్రామ్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. ఒక్క గంటలోనే అక్కడి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. రోడ్లు, అండర్‌పాస్‌లతోపాటు వీధులన్నీ నీటి మునగడంతో కిలోమీటర్ల మేర నాలుగైదు గంటలపాటు ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. మరోవైపు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం బాధలు వర్ణణాతీతంగా మారాయి. వర్ష బీభత్సం.. సమస్యలపై సోషల్‌ మీడియాలో కంప్లైంట్లు వెల్లువెత్తాయి

అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వారంపదిరోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు హిమాచల్ ప్రదేశ్‌ ప్రజలు. ఇప్పటికే వరదలకు పదులసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇప్పటివరకు 80మంది చనిపోయారు.

ఇక ఉత్తరాఖండ్‌లోనూ వర్షబీభత్సం కనిపిస్తోంది. చమోలీ గ్రామంలో క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాదు.. లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అలకనంద నది పొంగి పొర్లుతోంది. రుద్రప్రయాగ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. నది డేంజర్‌ లెవెల్‌కు మించి ప్రవహిస్తున్నాయి.

 

వీడియో చూడండి: