
Corona Virus India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో వైరస్ మార్పులపై తాజాగా జరిగిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచం చూడని కొత్త వేరియంట్ ఒకటి ఉందని.. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆ డబుల్ మ్యుటెంట్(రెండుసార్లు రూపాంతరం చెందే) వైరస్ వెలుగు చూసిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
దేశంలోని 18 రాష్ట్రాల్లో సుమారు 771 పాజిటివ్ కేసులపై అధ్యయనం చేయగా.. ఆయా కేసుల్లో వైరస్ మార్పులు జరిగినట్లు తేల్చారు. 736 కేసుల్లో బ్రిటన్ వైరస్, 34 కేసుల్లో దక్షిణాఫ్రికా వైరస్, ఒక్క కేసులో బ్రెజిల్ వైరస్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులకు ఈ వైరస్‌లు కారణమా.? కాదా.? అనే విషయాన్ని చెప్పలేమని.. వీటి జన్యుక్రమంపై ప్రస్తుతం అధ్యయనం కొనసాగిస్తున్నట్లు ఇండియన్ సార్స్ కొవ్ -2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ తెలిపింది. దేశంలోని సుమారు 70 జిల్లాల్లో కొత్త రకాల కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి జరిగిందని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్ ఎన్.కె.సింగ్ వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని… ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్రం.. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను సూచించింది. కరోనా వ్యాప్తి మరోసారి ఉధృతం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్‌గా ఉండాలని.. సూచించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు విడుదల చేసింది.
అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షల టెస్టుల సంఖ్యను 70 శాతానికి పెంచాలని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజల రద్దీ అధికంగా ఉండే ఏరియాలలో ప్రాంతాలలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని.. అయితే అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంగా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!