Inspiring Woman: నాకు అడుక్కోవాలని లేదు.. జీవించడం కోసం పెన్నులు అమ్ముతున్నా ఒక్కటి కొన్నా చాలు అంటున్న 80 ఏళ్ల బామ్మ

|

Oct 17, 2021 | 6:20 PM

Inspiring Woman: రోడ్డుమీద వెళ్తుంటే చాలు.. కొంతమంది అమ్మా అంటూ వెంటబడతారు. వారిలో చాలామందికి అన్ని అవయవాలు ఉండి ఏ పనిచేయకుండా అందరి ముందు చేయి..

Inspiring Woman:  నాకు అడుక్కోవాలని లేదు.. జీవించడం కోసం పెన్నులు అమ్ముతున్నా ఒక్కటి కొన్నా చాలు అంటున్న 80 ఏళ్ల బామ్మ
Pune Woman
Follow us on

Inspiring Woman: రోడ్డుమీద వెళ్తుంటే చాలు.. కొంతమంది అమ్మా అంటూ వెంటబడతారు. వారిలో చాలామందికి అన్ని అవయవాలు ఉండి ఏ పనిచేయకుండా అందరి ముందు చేయి చాచి యాచిస్తూ బతికేస్తారు. ఇక కొంతమంది యువత అయితే ఉద్యోగం రాలేదు..పనిచేయడానికి అవకాశాలు లేవు అంటూ ఇతరులపై ఆధారపడి కాలక్షేపం చేస్తుంటారు… ఇంకొందరు డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కి.. అందరినీ మోసం చేసి.. జీవిస్తుంటారు. అయితే కొంతమంది అవయవాలు లేకపోయినా.. వయసు మీద పడి పనిచేసే ఓపిక లేకపోయినా.. ఒకరిదగ్గర చేయి చంపకుండా.. తమకు తోచిన పని చేస్తూ జీవిస్తారు. అలాంటి వారిని ఎందరినో చూసి ఉంటాయి.. ఈరోజు ఆత్మాభిమానం అంటే ఇదీ అంటూ చాటిచెప్పిన ఓ బామ్మ ఫోటో.. బామ్మ గురించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి ఒక బామ్మ ఫోటోని షేర్ చేస్తూ.. ఆమె గురించి చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. తాను తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్‌లో వెళ్తున్న సమయంలో రతన్ అనే బామ్మను కలిసినట్లు చెప్పారు శిఖా. అంతేకాదు.. ఆ బామ్మ ఒక కార్డు బోర్డు తో తయారు చేసిన పెట్టెలో కొన్ని రంగురంగుల పెన్నులను పెట్టుకుని అమ్ముతున్నారు.. ఆ బోర్డు కు ఒక నోట్ ఉంది. అదేమిటంటే.. నేను యాచకురాలని కాను.. నేను ఎవరి దగ్గరా చేయి చాచను.. నాకు మీ ధర్మం వద్దు.. నా దగ్గర ఉన్న పెన్నులు కొనండి చాలు.. ఒకొక్క పెన్ను ఖరీదు రూ. 10 లు మాత్రమే .. థ్యాంక్యు. బ్లెస్‌ యూ’.. అని రాసుంది.

రతన్ బామ్మ విద్యార్థులను, వాహనదారులను రిక్వెస్ట్ చేసి.. తన వద్ద ఉన్న పెన్నులు అమ్ముతుంది. ఇలా అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితం గడుపుతుంది. ఈ విషయం తెలుసుకున్న శిఖా బామ్మ ఫోటో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. అంతేకాదు తన జీవితంలో నిజమైన ఛాంపియన్ రతన్ ను ఈరోజు కలిసినట్లు చెప్పారు. అంతేకాదు నేను నా ఫ్రెండ్ బామ్మ దగ్గర పెన్నులు కొనుగోలు చేశామని.. అప్పుడు ఆ బామ కళ్లలోని వెలుగు.. కృతజ్ఞత స్పష్టంగా చూశామని.. తాను చేసిన పని తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలిపేరు శిఖ. అంతేకాదు.. తన స్నేహితులు, తనకు తెలిసిన వారు ఎవరైనా బామ్మ పెన్నులు అమ్మే పరిసరప్రాంతాల్లో ఉంటె.. తప్పని సరిగా పెన్నులు కొనమని చెప్పారు. ఇక శిఖా రథి షేర్ చేసిన ఫోటోని చూసిన కొందరు టిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు పెన్నులు కొని మన వంతు సాయం చేస్తామని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: సందడిగా ‘అలయ్ బలయ్’.. మనదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇటువంటి కార్యక్రమాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య