NEET Student: నాకు డాక్టర్ కావాలని లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ నోట్..

పరీక్షలో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో, అనుకున్న కాలేజ్‌లో సీట్‌ రాలేదనో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూశాం. కానీ ఇక్కడో విద్యార్థి మాత్రం చిన్నటి నుంచి అన్నింటిలో టాపర్‌గా వస్తూ తాజాగా జరిగిన నీట్‌లోనూ మంచి ర్యాంక్‌ సాధించి.. కాలేజ్‌లో జాయిన్‌అవ్వాల్సిన రోజే ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకు ఈ విద్యార్థి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే.. మీరు కన్నీళ్లు పెట్టాల్సిందే.

NEET Student: నాకు డాక్టర్ కావాలని లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ నోట్..
Student Suicide

Updated on: Sep 24, 2025 | 2:09 PM

తమ కొడుకు మంచిగా చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ, మంచి లైఫ్‌ లీడ్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటారు. తాము ఫుల్‌ఫిల్‌ చేయలేని డ్రీమ్స్‌ను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని మరికొందరు అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది తల్లిదండ్రులు తమకు నచ్చిన ప్రోఫెషన్‌ను పిల్లలను ఎంచుకోమని చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు వాటిని చదవడం ఇష్టం లేక తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగు చూసింది. తన డాక్టర్ చదవడం ఇష్టం లేదని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర లోని చంద్రపూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుం

వివరాల్లోకి వెళ్తే.. చంద్రపూర్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అనురాగ్‌ అనిల్‌ బోర్కర్‌ అనే విద్యార్థి ఇటీవలే ఇంర్మీడియట్‌ పూర్తిచేసి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎంబీబీఎస్‌ చదివేందుకు సీట్‌ కోసం నీట్‌ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో అనిల్‌ ఓబీసీ కేటగిరీలో ఆలిండియా 1475 ర్యాంక్‌ సాధించాడు. దీంతో అతనికి ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌లో ఉన్న ఓ మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది. దీంతో అనిల్‌ను కాలేజ్‌ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తుకున్నారు. అడ్మిషన్‌ డేట్‌ కూడా రావడంతో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.

కానీ ఇంతలోనే వారి ఇంట్లో పెను విషాదం వెలుగు చూసింది. కరెక్ట్‌గా కాలేజ్‌లో జాయిన్‌ అవ్వాల్సిన రోజే అనురాగ్‌ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయిన ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అతని చేసితో ఒక లెటర్‌ను గమనించారు. అందులో ఇలా రాసి ఉంది.. నేను డాక్టర్‌ కావాలనుకోవడం లేదని అనురాగ్‌ రాసి చివరి అక్షరాలు కనిపించాయి. అది ఆ తల్లిదండ్రులను మరింత శోకానికి గురిచేసింది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.