మోదీ ఎఫెక్ట్: ఇమ్రాన్‌కు ట్రంప్‌ క్లాస్‌

| Edited By:

Aug 20, 2019 | 5:30 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మరోసారి క్లాస్‌ తీసుకున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేయోద్దని సూచించారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చెలరేగకుండా చూడాలని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇటీవల ఇమ్రాన్‌ వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..కశ్మీర్‌ అంశంలో తొలిసారిగా ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఇమ్రాన్‌తో సంభాషించిన ట్రంప్‌..నోరు జారొద్దని ఇమ్రాన్‌కు హితవు పలికారు. కశ్మీర్‌ అంశంపై అగ్రరాజ్యాధినేత ట్రంప్‌..భారత్‌, పాక్‌ ప్రధానులిద్దరితోనూ […]

మోదీ ఎఫెక్ట్: ఇమ్రాన్‌కు ట్రంప్‌ క్లాస్‌
Follow us on

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మరోసారి క్లాస్‌ తీసుకున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేయోద్దని సూచించారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చెలరేగకుండా చూడాలని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇటీవల ఇమ్రాన్‌ వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..కశ్మీర్‌ అంశంలో తొలిసారిగా ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఇమ్రాన్‌తో సంభాషించిన ట్రంప్‌..నోరు జారొద్దని ఇమ్రాన్‌కు హితవు పలికారు.

కశ్మీర్‌ అంశంపై అగ్రరాజ్యాధినేత ట్రంప్‌..భారత్‌, పాక్‌ ప్రధానులిద్దరితోనూ చర్చించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు డొనాల్డ్‌.  ఇరువురూ మంచి మిత్రులు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌తోనూ మాట్లాడాను. కశ్మీర్‌ అంశంలో రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేయాలని కోరినట్లు ట్వీట్‌ చేశారు. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

370 రద్దు విషయంలో ఇమ్రాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ..దీనిపై తొలిసారిగా అమెరికా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి చరమగీతం పాడాలన్నారు.  పేదరికం, నిరక్షరాస్యతపై పోరాటంలో ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. మోదీతో ఫోన్‌ సంభాషణ అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడిన ట్రంప్‌..కశ్మీర్‌ విషయంలో దూకుడు వద్దని  సూచించారు. శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.