దేశవ్యాప్తంగా సర్కార్ వైద్యంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట ప్రభుత్వ ఆస్పత్రుల పనీ తీరు ప్రజల్లో మరింత అసహనాన్ని నింపుతోంది. ఎక్కడ చూసిన వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. వైద్యం అందక కొందరు, వైద్యం వికటించి ఇంకొందరు సర్కార్ దవాఖానాల్లో అవస్థలు పడుతున్నారు. ఇకపోతే, తాజాగా ఓ ప్రభుత్వ ఆసుపత్రి బెడ్‌పై కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా షహబ్‌గంజ్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా తెలిసింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సంబంధిత శాఖాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చకియా తహసీల్‌లోని షహబ్‌గంజ్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి బెడ్‌పై రోగికి బదులుగా కుక్క విశ్రాంతి తీసుకుంటోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందౌలీ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఈ ప్రాంతం నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా పరిగణించబడింది. ఈ ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆరోగ్య శాఖ షహబ్‌గంజ్ బ్లాక్ ఆవరణలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు చూసి వైద్యం కోసం వెళ్లిన రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చందౌలీ సిఎంఓ డాక్టర్ యుగల్ కిషోర్ రాయ్ మాట్లాడుతూ, తన నా వాట్సాప్‌లో వైరల్ వీడియో చూశానని చెప్పారు. నేను వెంటనే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలిపారు.. విచారణ తర్వాత సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా..ఆసుపత్రులన్నింటిని వాటి సూపరింటెండెంట్‌లను, ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేదంటే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి