Dog Bite: కాఠిన్యమా! కారుణ్యమా! తెలుగు రాష్ట్రాల నిండా.. వీధికుక్కల బాధితులే!
వీధికుక్కలన్నింటికి రేబీస్ టీకాలు వేయాలి. అది కూడా ఫ్రీగా. ఇది డిమాండ్ కాదు. అలా చేయాలని ప్రభుత్వ పాలసీ కూడా ఉంది. కానీ గవర్నమెంట్ వెటర్నరీ ఆస్పత్రులకు ఇస్తున్న నిధులే అంతంత మాత్రం. ఇక కుక్కలకు వ్యాక్సిన్లు వేయడమా? దాదాపు అసాధ్యం. ప్రభుత్వం ఇచ్చే ఆ కాసిన్ని నిధులతోనే ఆవులు, గేదెలకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వాళ్లకు రైతులే మొదటి ప్రాధాన్యత కాబట్టి.

వీధికుక్కలన్నింటికి రేబీస్ టీకాలు వేయాలి. అది కూడా ఫ్రీగా. ఇది డిమాండ్ కాదు. అలా చేయాలని ప్రభుత్వ పాలసీ కూడా ఉంది. కానీ గవర్నమెంట్ వెటర్నరీ ఆస్పత్రులకు ఇస్తున్న నిధులే అంతంత మాత్రం. ఇక కుక్కలకు వ్యాక్సిన్లు వేయడమా? దాదాపు అసాధ్యం. ప్రభుత్వం ఇచ్చే ఆ కాసిన్ని నిధులతోనే ఆవులు, గేదెలకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వాళ్లకు రైతులే మొదటి ప్రాధాన్యత కాబట్టి. పైగా వెటర్నరీ విభాగంలో ఉండే ఉద్యోగుల సంఖ్య మహా తక్కువ. సో, వీధికుక్కలు పెరగడానికి, రేబిస్‌తో మనుషులు చనిపోడానికి ఇదీ ఓ కారణమే. ప్రతి ఒక్క పేరెంట్ చూడాలి ఈ వీడియో. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతున్నా ఒక్కోసారి తల్లిదండ్రులపై ఉన్న భయాలతో కొన్నికొన్నిసార్లు నిజాలు దాచేస్తుంటారు. అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చెప్పే సంఘటన ఇది. స్కూల్‌కు వెళ్తూ, తోటివాళ్లతో చక్కగా ఆడుకుంటూ తిరిగిన పిల్లాడు ఇతను. వయసు 9 ఏళ్లు. ఉన్నట్టుండి వింత ప్రవర్తన. ఇదివరకు గలగలా మాట్లాడే పిల్లాడు.. తడబడుతూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. కొత్తవాళ్లే గానీ, అయిన వాళ్లే గానీ దగ్గరికొస్తే కొన్నిసార్లు బెదిరిపోవడం గమనించారు. గాలి వీస్తున్నా, ఫ్యాన్ వేసినా తట్టుకోలేకపోయాడు. చేతికి నీళ్లిస్తే.. గ్లాస్ ఎత్తి తాగడం కాదు నాలుకతో గతకాలనుంది అని అలా తాగి చూపించాడు. డాక్టర్లకు విషయం అర్ధమైంది. నెక్ట్స్ ఏం జరగబోతోందో కూడా తెలుసు ఆ డాక్టర్లకు. బట్.. ఇక్కడ తెలుసుకోవాల్సింది పేరెంట్స్ కూడా. ఆస్పత్రిలో చేరినప్పుడు యాక్టివ్‌గానే...
