ప్రస్తుతం వైద్యులపై దాడులు పరిపాటిగా మారింది. సహానం కోల్పోతున్న ప్రజలు ప్రాణాలు రక్షించే డాక్టర్లపైవిచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చెప్పులు వాడకూడదని చెప్పినందుకు ఓ వైద్యుడిని కొట్టారు కొందరు యువకులు. తలకు గాయం కావడంతో మహిళను ఆస్పత్రికి తరలించిన కొందరు వ్యక్తులు ఈ వీరంగం సృష్టించారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో డాక్టర్‌పై దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. డాక్టర్‌ను కొట్టిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఓ మహిళ బెడ్‌పై పడుకుని ఉన్న వీడియోలో ఉంది. పక్కనే కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ జైదీప్ సింగ్ గోహిల్ అక్కడికి చేరుకున్నారు. పేషెంట్‌తో పాటు వచ్చే వారిని చెప్పులు తీయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వైద్యుడికి, ఆయనతో పాటు ఉన్న వ్యక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలోనే వారంతా ఆ డాక్టర్‌పై దాడికి దిగారు. సామూహిక దాడిలో డాక్టర్ కిందపడిపోయాడు. మంచం మీద పడుకున్న మహిళ కూడా లేచి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గదిలో ఉన్న నర్సు కూడా వారిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆపలేకపోయారు..చివరకు కింద పడిపోయిన డాక్టర్ లేచి తనను కాపాడుకునేందుక గానూ.. ఆ పక్కనే ఐరన్ స్టూల్ ఎత్తుకుని దాడికి యత్నించాడు. ఇరువురి గొడవతో ఆ వార్డులోని మందులు, ఇతర పరికరాలు అన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని ధ్వంసమయ్యాయి.
ఈ వీడియో చూడండి..
Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;
Altercation erupts over removing shoes.
A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward.”#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024
కాగా, డాక్టర్‌పై దాడి ఘటనతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా డాక్టర్‌ని కొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు యువకుల తీరుపై మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..