Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకున్నారా.. డోన్ట్ వర్రీ వెంటనే ఇలా చేయండి..

|

May 11, 2022 | 6:32 AM

Train Ticket: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్(Train network) గా ఉంది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ కావటం విశేషం.

Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకున్నారా.. డోన్ట్ వర్రీ వెంటనే ఇలా చేయండి..
Follow us on

Train Ticket: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్(Train network) గా ఉంది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ కావటం విశేషం. ప్రతిరోజు లక్షల మంది ఈ ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణంలో ఎక్కడైనా మీరు టికెట్ పోగొట్టుకుంటే ఏం చేయాలి. దీనికి సంబంధించి రైల్వే కొన్ని నియమాలను సూచించింది. దీనికి సంబంధించి.. రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోయినట్లయితే ప్రయాణికులు చించవలసిన అవసరం లేదు. వెంటనే టీసీ ద్వారా డూప్లికేట్‌ టికెట్‌ని పొందవచ్చు. దీని కోసం మీరు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఉంటుంది.

అయితే టికెట్‌ కనిపించకుండాపోయినా వెంటనే మీరు టీసీని సంప్రదించాలి. అతడికి డూప్లికేట్ టికెట్‌ జారీచేసే అధికారం టికెట్ కలెక్టర్ కు ఉంటుంది. భారతీయ రైల్వే వెబ్‌సైట్ indianrail.gov.in ప్రకారం.. మీరు రూ. 50 చెల్లించి స్లీపర్ క్లాస్ డూప్లికేట్ టిక్కెట్‌ను పొందవచ్చు. అలాగే సెకండ్ క్లాస్ వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కోల్పోయిన అసలు టికెట్‌ దొరికితే రైలు దిగాక రెండు టిక్కెట్లను అధికారులకు చూపించవచ్చు. అలా చేస్తే డూప్లికేట్ టిక్కెట్‌కి చెల్లించిన రుసుము వాపసు చెల్లిస్తారు. అయితే టికెట్‌ మొత్తంలో 5% తీసివేస్తారు. అంటే కనిష్టంగా రూ. 20 అవుతుంది.

అలాగే టికెట్‌ రిజర్వేషన్‌ సమయంలో తరచుగా ప్రయాణికులు మిడిల్ బెర్త్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపరు. ఎందుకంటే చాలా సార్లు దిగువ బెర్త్‌లోని ప్రయాణీకులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. దీనివల్ల మిడిల్ బెర్త్‌తో ప్రయాణీకులకు సమస్యలు ఎదురవుతాయి. ఇది కాకుండా చాలాసార్లు మిడిల్ బెర్త్ ప్రయాణికులు బెర్త్‌ను ఓపెన్‌ చేయడం వల్ల దిగువ బెర్త్‌పై కూర్చున్న ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితిలో మీరు బెర్త్‌కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణీకుడు తన బెర్త్‌ను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచి ఉంచి పడుకోవచ్చు. ఒకవేళ 10 గంటలలోపు ఓపెన్‌ చేస్తే లోయర్ బెర్త్ ప్యాసింజర్ అభ్యంతరం చెప్పవచ్చు.

ఇవీ చదవండి..

Inflation: కలవరపెడుతోన్న ద్రవ్యోల్బణం.. 18 నెలల గరిష్ఠానికి చేరుకునే అవకాశం..

Sri Lanka Crisis: అల్లర్లకు పాల్పడే వాళ్లు కన్పిస్తే కాల్చివేత.. శ్రీలంక సర్కార్ సంచలన నిర్ణయం!