Luxury Car Smuggling Racket: లగ్జరీ కార్లపై సుంకం ఎగవేత వ్యవహారం గుట్టురట్టు.. ఆరు కార్లు స్వాధీనం

|

Jul 17, 2021 | 9:39 AM

Luxury Car Smuggling Racket: దౌత్యపరమైన అధికారులను ఉపయోగించుకునే లగ్జరీ కార్ల రాకెట్‌ను ముంబై యూనిట్‌ ఆఫ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) బయట..

Luxury Car Smuggling Racket: లగ్జరీ కార్లపై సుంకం ఎగవేత వ్యవహారం గుట్టురట్టు.. ఆరు కార్లు స్వాధీనం
Follow us on

Luxury Car Smuggling Racket: దౌత్యపరమైన అధికారులను ఉపయోగించుకునే లగ్జరీ కార్ల రాకెట్‌ను ముంబై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) బయటపెట్టింది. భారతదేశంలో హై-ఎండ్ లగ్జరీ కార్లను అక్రమంగా రవాణా చేయడంలో, ప్రైవేటు వ్యక్తులకు చేర్చడం జరిగినట్లు డీఆర్‌ఐ గుర్తించింది. హర్యానాలోని గుర్గావ్‌లోని కారు డీలర్‌ షిప్‌ సీఈవోతో సహా వివిధ నగరాల నుంచి ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే గత ఐదేళ్లలో దౌత్యవేత్తల పేరిట 20కిపైగా లగ్జరీ వాహనాలను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. దీని ఫలితంగా రూ.25 కోట్లకుపైగా పన్ను ఎగవేత జరిగినట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.  భారతీయులు లేదా మరే వ్యక్తి అయినా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని 125 శాతం ఐజీఎస్టీ, 28 శాతం, 12.5శాతం సర్‌చార్జీలున్నాయి. ఒకప్పుడు దౌత్యవేత్తల పేరిట దిగుమతి చేసుకున్న కార్ల వ్యాపారులు సుంకం నుంచి తప్పించుకున్నారు. కాగా, ఈ కస్టమ్స్‌ నేరాల చరిత్ర కలిగిన దుబాయ్‌కి చెందిన కింగ్‌పిన్‌గా గుర్తించారు. యూనైటెడ్‌ కింగ్‌డమ్‌, జపాన్‌, యూఏఈ నుంచి దౌత్యవేత్తల పేరిట భారతదేశానికి ఇటువంటి దిగుమతులు జరుగుతున్నాయని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తెలపింది.

ఈ సందర్భంగా డీఆర్‌ఐ అధికారులు మాట్లాడుతూ.. దుబాయ్‌ ఆధారిత వ్యక్తి గత ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దౌత్యవేత్తల పేరిట యూకే, జపాన్‌, యూఏఈ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లు భారతదేశంలోకి దిగుమతి చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. కస్టమ్స్‌ చట్టం 1962లోని నిబంధనల ప్రకారం.. మొత్తం ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గురుగ్రామ్‌కు చెందిన లగ్జరీకారు డీలర్‌షిప్‌ ఈఈవోతో సహా ముగ్గురు ఈ రాకెట్‌ వ్యవహారంలో అరెస్టు చేసినట్లు చెప్పారు.

 

ఇవీ కూడా చదవండి:

రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా నేడు అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవం

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన కిలాడి లేడీ.. పోలీసుల అదుపులో మహిళ