ఐదేళ్ల కిందట తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా కార్యాచరణ పేద, బడుగు బలహీన వర్గాల వారికి అదొక జీవన పంథా అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. దీనిని సాధారణ ప్రభుత్వ పథకంలా భావించలేమని, మానవ ఆధారిత అభివృద్ధికి ఇది సాక్షీభూతంలా మారిందని, అందుకు డిజిటల్ ఇండియాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని మోదీ తెలిపారు. సాంకేతికత ద్వారా జనజీవన సౌందర్యం మరింత విస్తృతమైందని.. కోట్లాది మంది రైతులు ఒక్క క్లిక్ తో ద్రవ్యపరమైన మద్దతు పొందగలుగుతున్నారని మోదీ వివరించారు. భారతదేశంలో అత్యుత్తమ మేధావులు ఉన్నారు. అతిపెద్ద మార్కెట్లు కూడా మనవే అని ప్రధాని చెప్పుకొచ్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న ఈ శాస్త్రసాంకేతిక విజ్ఞాన సదస్సులో మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. 25 ఏళ్ల కిందట భారత్ లో ఇంటర్నెట్ ప్రవేశించిందని, ఇటీవలే దేశంలోని ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 750 మిలియన్లు దాటిందని, అయితే ఇందులో సగం కనెక్షన్లు గత నాలుగేళ్లలో నమోదైనవేనని మోదీ వెల్లడించారు. ఈ వార్తా ప్రపంచంలో సమాచారమే ముడిసరుకు అని, ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. మన యువత శక్తిసామర్థ్యాలు, శాస్త్రసాంకేతిక అవకాశాలు అపారం అన్నమోదీ.. ఈ దిశగా పాటవ ప్రదర్శనకు, పరపతి పెంపుకు ఇదే తగిన సమయం అని అన్నారు. మన ఐటీ రంగం దేశాన్ని గర్వించేలా చేస్తుందని తనకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు. టెక్, ఆవిష్కరణల రంగాన్ని మరింత స్వేచ్ఛాయుతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు.
The Information Era is different from the Industrial Era. The Information Era brings many opportunities that our youth can harness. pic.twitter.com/gUYeBCWKfq
— Narendra Modi (@narendramodi) November 19, 2020