మమతా బెనర్జీ కోసం ఎంపీ సీటు త్యాగం? యూసుఫ్ పఠాన్-గంగూలీ మధ్య రాయబారం నిజమేనా?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బహరంపూర్ లోక్‌సభ సీటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. లోక్‌సభ స్థానం చుట్టూ తిరుగుతున్న ఒక సంచలన వార్తపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటుకు ఎన్నికయ్యేందుకు వీలుగా, బహరంపూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేయాలంటూ యూసుఫ్ పఠాన్‌కు సందేశం పంపేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) తనను రాయబారిగా వాడుకుందనే వార్తలను గంగూలీ పూర్తిగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

మమతా బెనర్జీ కోసం ఎంపీ సీటు త్యాగం? యూసుఫ్ పఠాన్-గంగూలీ మధ్య రాయబారం నిజమేనా?
Sourav Ganguly, Yusuf Pathan, Mamata Banerjee

Updated on: Jun 06, 2026 | 5:19 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బహరంపూర్ లోక్‌సభ సీటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. లోక్‌సభ స్థానం చుట్టూ తిరుగుతున్న ఒక సంచలన వార్తపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటుకు ఎన్నికయ్యేందుకు వీలుగా, బహరంపూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేయాలంటూ యూసుఫ్ పఠాన్‌కు సందేశం పంపేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) తనను రాయబారిగా వాడుకుందనే వార్తలను గంగూలీ పూర్తిగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలను సౌరవ్ గంగూలీ అవాస్తవమైనవిగా, తప్పుదోవ పట్టించేవిగా అభివర్ణించారు. తాను ఈ విషయమై యూసుఫ్ పఠాన్‌తో ఎప్పుడూ మాట్లాడలేదని, ఎలాంటి రాజకీయ సందేశాలను ఆయనకు చేరవేయలేదని పేర్కొన్నారు. అసలు మమతా బెనర్జీ తనను అలాంటి సందేశాన్ని పంపమని ఎప్పుడూ కోరలేదన్నారు. తాను ఏ రాజకీయ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదని దాదా స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి తన పేరును లాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కనీస ధృవీకరణ లేకుండా ఇలాంటి సున్నితమైన రాజకీయ వార్తలను ప్రచురించడం పూర్తిగా తప్పని గంగూలీ మండిపడ్డారు. ఏదైనా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని ఆయన మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రచురితమైన నివేదికల్లోని ఆరోపణలు కేవలం ఊహాజనితాలే తప్ప, వాటిలో ఎలాంటి సత్యం లేదని తేల్చిచెప్పారు.

తాను ఎప్పుడూ ఏ రాజకీయ కార్యకలాపాల్లోనూ లేదా పార్టీల అంతర్గత విషయాల్లోనూ పాలుపంచుకోలేదని గంగూలీ గుర్తుచేశారు. ఈ మొత్తం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ, ఆ ఆరోపణలన్నింటి నుంచి తనను తాను పూర్తిగా దూరం చేసుకున్నారు. యూసుఫ్ పఠాన్ కూడా ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదని, అసలు అలాంటి ప్రసక్తే లేదని గంగూలీ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us