
తమిళనాడులోని కరూర్‌లో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.. కరూర్ ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఇంకా కొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.. పలువురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీ ఘటనపై విచారణ కొనసాగుతోంది.. ఈ తరుణంలో కరూర్ తొక్కిసలాటపై టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించడంతోపాటు.. వీడియో విడుదల చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. ఎంతో ప్రేమతో తన మీటింగ్‌కు ప్రజలు వచ్చారని.. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని విజయ్ పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. సీఎం స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
త్వరలోనే నిజం బయటపడుతుందని.. తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని విజయ్ పేర్కొన్నారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు.. నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లకండి.. అంటూ విజయ్ కోరారు. ఇలాంటి ఘటన కరూర్‌లోనే ఎందుకు జరిగింది..? ఈ ఘటన ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.. అంటూ విజయ్ పేర్కొన్నారు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని.. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగిందని తెలిపారు. నేను మరింత బలంగా బయటకు వస్తానంటూ విజయ్ వీడియో తెలిపారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..