వైద్యుడి భార్య నిర్వాకం.. భర్త లేడని పేషెంట్‌కి ఆపరేషన్‌.. కొద్దిసేపటికే రోగి మృతి!

|

Oct 16, 2022 | 8:20 PM

అసలే నకిళీ వైద్యుడు.. సమయానికి అందుబాటులో లేకపోవడంతో అతని భార్య బరిలోకి దిగి ఓ వ్యాపారవేత్తకు ఆపరేషన్‌ చేసి పన్ను తొలగించింది. అనంతరం సదరు వ్యక్తి మృతి చెందాడు. దీంతో అసలు కథ బయటపడింది. వివరాల్లోకెళ్తే..

వైద్యుడి భార్య నిర్వాకం.. భర్త లేడని పేషెంట్‌కి ఆపరేషన్‌.. కొద్దిసేపటికే రోగి మృతి!
Fake Dentist
Follow us on

అసలే నకిళీ వైద్యుడు.. సమయానికి అందుబాటులో లేకపోవడంతో అతని భార్య బరిలోకి దిగి ఓ వ్యాపారవేత్తకు ఆపరేషన్‌ చేసి పన్ను తొలగించింది. అనంతరం సదరు వ్యక్తి మృతి చెందాడు. దీంతో అసలు కథ బయటపడింది. వివరాల్లోకెళ్తే..

ఒరిస్సాలోని మల్కాజిగిరి జిల్లా్లోని కలిమెల సమితిలో తపస్‌పాల్‌ అనే వ్యాపారి గత కొద్ది కాలంగా పంటి నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కలిమెల సమితిలోని వైద్యుడు రవీంద్రనాథ్‌ బిస్వాస్‌ను కలవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో వైద్యుడు లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే స్వయంగా వ్యాపారి పన్ను తొలగించింది. ఆ తర్వాత అతనికి తీవ్ర రక్తస్రావం కావడం ప్రారంభమయ్యింది. దీంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించడానికి కలిమెలలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితున్ని పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. నిజానికి.. సదరు వ్యాపారవేత్తకు డయామెటిక్‌, రక్తపోటు ఉన్నాయి. వైద్యుడి వేషమెత్తిన బసంతి రోగికి ఎటువంటి మెడికల్ చెకప్‌లను నిర్వహించకుండానే అతనికి పన్ను తొలగించింది. అతని మెడికల్‌ కండీషన్లను బట్టి దంతాల తొలగింపుకు సిద్ధంగాలేడని మృతుడి బంధువులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తపస్‌పాల్‌ మృతి వార్త తెలియగానే రవీంద్రనాథ్ బిస్వాస్, అతని భార్య బసంతి పరారయ్యారు. దీనిపై మృతుడి బంధువులు కలిమెల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విచారణలో రవీంద్రనాథ్‌ బిస్వాస్‌ నకిళీ వైద్యుడని, క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదని బయటపడింది.