Watch Video: సినిమా లెవెల్ సీన్‌.. రన్నింగ్‌ లారీలోంచి వస్తువులు ఎలా కొట్టేస్తున్నారో చూడండి!

కొందరు వ్యక్తులు చేసే దొంగతనాలు అప్పడప్పుడూ జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా షోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక దొంగతనానికి సంబంధించిన వీడియో కూడా నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందకంటే వారు సినిమా తరహాలో రన్నింగ్‌లో ఉన్న లారీపైకి ఎక్కన ఇద్దరు దొంగలు దానిలోని వస్తువులను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కారు.

Watch Video: సినిమా లెవెల్ సీన్‌.. రన్నింగ్‌ లారీలోంచి వస్తువులు ఎలా కొట్టేస్తున్నారో చూడండి!
Viral Video

Updated on: Sep 10, 2025 | 9:15 PM

సినిమా తరహాలో రన్నింగ్‌లో ఉన్న లారీపైకి ఎక్కన ఇద్దరు దొంగలు దానిలోని వస్తువులను చోరీ చేసి వాటిని లారీ వెంబడే బైక్‌ పై వస్తున్న తమ గ్యాంగ్‌ సభ్యులకు అందజేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేపట్టి పోలీసులు ఈ దొంగతనానికి పాల్పడిన మొత్తం ఆరుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఈ సంఘటన జరిగింది. రత్నాపూర్ గ్రామం సమీపంలో హైవేపై నెమ్మదిగా వెళ్తున్న ఓ లారీలోకి ఇద్దరు ముసుగు దరించిన వ్యక్తులు ఎక్కారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలతో లారీపై ఉన్న కవర్‌ను తొలగించి. అందులో ఉన్న వస్తువులను రోడ్డుపైకి విసిరేశారు. అదే క్రమైంలో బైక్‌లపై లారీ ఫాలో అవుతున్న వారి గ్యాంగ్‌ సభ్యులు లారీలోంచి విసిరిన వస్తువులను సేకరిస్తున్నారు.

రోడ్డుపై వెళ్తున్న సదురు వాహన దారుడు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ధరాశివ్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దృష్టికి చేరింది. దీంతో ఈ దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దొంగతనానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.