రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.

రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan On Farmers

Updated on: Apr 11, 2026 | 5:39 PM

రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ఓండాలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమత్రి అమిత్ షా వెల్లడించిన నిజం, బెంగాల్ వ్యాప్తంగా రైతులు అనుభవిస్తున్న కష్టాల యథార్థ రూపాన్ని తెలియజేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో బంగాళాదుంప రైతులు తమ కష్టానికి తగిన నిజమైన విలువను పొందలేక సతమతమవుతున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ఇది రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం చేస్తున్న క్రూరమైన దాడి అని మండిపడ్డారు. టీఎంసీ పాలనలో దళారుల ముఠాలు విజృంభించగా, అన్నదాత మాత్రం తన సొంత రాష్ట్రంలోనే పోరాడుతూనే ఉన్నాడని అన్నారు.

రైతు పొలాల్లో కష్టపడి చెమటోడ్చగా, వ్యవస్థాగతమైన దుర్వినియోగం అతనికి దక్కాల్సిన హక్కులను మమతా బెనర్జీ సర్కార్ దూరం చేసిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. అయితే, ఇకపై అలా జరగదని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, బెంగాల్ బంగాళాదుంపలు ఒడిశా, జార్ఖండ్‌లతో సహా దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరతాయని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తద్వారా బెంగాల్ రైతులు తమ పంటకు పూర్తి విలువను పొందుతారన్నారు. అన్నదాతల కష్టానికి నిజంగా దక్కాల్సిన గౌరవం లభిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు.

ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదన్న ఆయన, ఇది బెంగాల్ రైతుల గౌరవాన్ని పునరుద్ధరిస్తామని చేసిన గంభీరమైన ప్రతిజ్ఞ అన్నారు. బెంగాల్ రైతులు ఇకపై అన్యాయాన్ని కేవలం భరించడానికి నిలబడరు, దానికి ముగింపు పలకడానికి ఐక్యంగా నిలబడ్డారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us