Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్.. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్

డీజీసీఏ విమాన ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు కఠిన రూల్స్ తీసుకురాబోతుంది. ఇకపై విమానంలో దురసుగా ప్రవర్తించడం లేదా దాడికి పాల్పడటం లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. దీంతో విమానాల్లో ప్రయాణించే సమయంలో ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. త్వరలోనే వీటిని అమలు చేయనుంది.

Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్..  అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్
Flight

Edited By:

Updated on: Feb 24, 2026 | 8:12 PM

విమాన ప్రయాణికులకు హెచ్చరిక. విమాన ప్రయాణంలో భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విమాన ప్రయాణంలో క్రమశిక్షణకు భంగం కలిగించే ప్రయాణికులపై ఇకపై కఠిన చర్యల తీసుకునేందుకు సిద్దమవుతోంది. విమాన ప్రయాణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేసేందుకు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. విమాన ప్రయాణంలో దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. అలాంటివారు కనీసం 30 రోజుల పాటు విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించనుంది. విమాన ప్రయాణికులు, సిబ్బంది భద్రతే ప్రధాన లక్ష్యమని కఠిన రూల్స్ తీసుకొస్తుంది

మద్యం, పొగ తాగడం చేస్తే..

విమానంలో పొగ తాగడం లేదా దేశీయ విమానాల్లో మద్యం సేవించడం, అత్యవసర ద్వారాలను తాకడం, డోర్లను తెరవడానికి ప్రయత్నించడం, లైఫ్ జాకెట్లు వంటి భద్రతా పరికరాలను అనుమతి లేకుండా ఉపయోగించడం వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే ఎయిర్‌లైన్స్ తక్షణమే చర్యలు తీసుకోవచ్చని DGCA స్పష్టం చేసింది.

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తప్పనిసరి

ప్రయాణికులను నియంత్రించేందుకు ప్రతి ఎయిర్‌లైన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించి అమలు చేయాలని డీజీసీఏ సూచించింది. ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించే స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీలో మరో ఎయిర్‌లైన్ ప్రతినిధి కూడా ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణ నిషేధంపై తుది నిర్ణయం ఈ కమిటీ తీసుకుంటుంది.

లెవల్ వారీగా కఠిన శిక్షలు

-ప్రయాణికుల ప్రవర్తన తీవ్రతను బట్టి నిషేధం కాలాన్ని నిర్ణయిస్తారు

-లెవల్ 1 – 3 నెలల వరకు నిషేధం: దుష్ప్రవర్తన, ఇతరులను వేధించడం, కొట్టడం లేదా తన్నడం, అతిగా మద్యం సేవించి ఇబ్బంది కలిగించడం వంటివి ఇందులోకి వస్తాయి

-లెవల్ 2 – 6 నెలల వరకు నిషేధం: తొయ్యడం, లాక్కోవడం, అసభ్యంగా తాకడం, లైంగిక వేధింపులు వంటివి ఆ దశలోకి వస్తాయి

-లెవల్ 3 – 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ నిషేధం: ప్రాణాలకు ముప్పు కలిగించే దాడులు, గొంతు పిసకడం ప్రయత్నం, విమాన వ్యవస్థను ధ్వంసం చేయడం వంటి  ఈ దశలోకి వస్తాయి

-లెవల్ 4 – 2 ఏళ్లు లేదా అంతకు మించి నిషేధం: పైలట్ క్యాబిన్‌లోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించడం లేదా చొరబడడం

సూచనల ఆహ్వానం

ఈ సవరణలపై సంబంధిత వ్యక్తులు, సంస్థలు మార్చి 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని డీజీసీఏ కోరింది. ప్రయాణ భద్రతపై రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాన్ని ఈ ప్రతిపాదనలు ఇస్తున్నాయి.

Follow Us