Video: డెలివరీ బాయ్ ముసుగులో మృగం.. ఇంట్లోకి చొరబడి యువతికి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ..
సమాజంలో తిరుగుతున్న కొందరు మృగాలకు ఆడవాళ్లంటే ఎంతో చులకన.. తాము ఏం చేసినా అడ్డుకునేవారే లేరనుకుంటారు. డెలివరీ బాయ్ ముసుగులో వచ్చిన ఒక వికృత మృగం, ఇంట్లోకి చొరబడి ఒంటరి మహిళ ఎదుట నగ్న ప్రదర్శన చేసిన హేయమైన ఘటన ఐటీ హబ్ బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సమాజంలో మహిళలకు కనీస గౌరవం, రక్షణ లేకుండా పోతుందనడానికి బెంగళూరులో జరిగిన ఈ హేయమైన ఘటనే నిదర్శనం. ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చి, ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసి, నీచ బుద్ధితో ప్రవర్తించిన డెలివరీ ఏజెంట్ ఉదంతం సంచలనం రేపుతోంది. కనీస సంస్కారం లేని ఆ కామాంధుడు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్సిల్ ఇవ్వడానికని వచ్చిన ఆ దుర్మార్గుడు, అత్యవసరంగా ఉందంటూ వాష్ రూమ్ వాడుకోవడానికి అనుమతి అడిగాడు. అపరిచిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వనని, పక్కనే ఉన్న మగవారిని అడగాలని ఆ మహిళ చాలా మర్యాదగా, స్పష్టంగా చెప్పింది. ఒక మహిళ వద్దని మొహం మీదే చెప్తున్నా, సిగ్గు లేకుండా ఆ నీచడు చెప్పులు విప్పి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు. తన కామ కోరికను తీర్చుకోవడానికి లేదా మహిళను భయభ్రాంతులకు గురిచేయడానికి అతడు పక్కా ప్లాన్‌తోనే లోపలికి వెళ్లినట్లు అతని ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది.
వాష్ రూమ్ నుండి బయటకు వచ్చి..
లోపలికి వెళ్లడమే కాకుండా వాష్ రూమ్ నుండి బయటకు రాగానే తన అసలు నైజాన్ని బయటపెట్టాడు. కనీసం లోపల ఉన్నది తనలాంటి మనిషే అనే విచక్షణ కూడా మరచి, ఆ మహిళ ఎదుట తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ నగ్న ప్రదర్శన చేశాడు. ఇంతకంటే నీచమైన, అసహ్యకరమైన ప్రవర్తన మరొకటి ఉండదు. ఒక మహిళ నో అని చెప్పినప్పుడు ఆ హద్దులను గౌరవించకుండా, విచ్చలవిడిగా ప్రవర్తించిన ఆ మృగాడి తీరుతో బాధిత మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి, అవమానానికి గురైంది.
ప్రాణభయంతో వణికిపోయిన మహిళ..
ఆ దుర్మార్గుడి వికృత చేష్టలతో ఆ మహిళ తన సొంత ఇంట్లోనే ప్రాణభయంతో వణికిపోయింది. ఏదైనా ఘోరం జరుగుతుందేమోనన్న భయంతో ఫోన్ కెమెరా ఆన్ చేసి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మెయిన్ డోర్ వద్ద నిలబడాల్సి వచ్చింది. సమాజంలో ఇలాంటి కీచకులు తిరుగుతుండటం వల్లే మహిళలు తమ ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి దాపురించింది.
నిందితుడి వేటలో బెంగళూరు పోలీసులు..
ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవడంతో బెంగళూరు పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ నీచమైన పనికి ఒడిగట్టిన ఆ కీచకుడిని గుర్తించి, కఠినంగా శిక్షించేందుకు వీలుగా ఆధారాలు పంచుకోవాలని బాధిత మహిళను కోరారు. డెలివరీ బాయ్ ముసుగులో తిరుగుతున్న ఇలాంటి మృగాలను కటకటాల వెనక్కి నెట్టడమే కాకుండా, ఇటువంటి పనులు చేయాలంటేనే భయపడేలా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
Horrifying incident in Bengaluru: A Flipkart/Myntra delivery agent forced his way into @nilofer_vlogs’ flat despite her clear refusals and exposed himself inside her home. This demands immediate police action!@BlrCityPolice pic.twitter.com/v15SwDscjE
— Gaurav Karan Chaudhary (@Gaurav_karan22) July 12, 2026




