Liquor Shops: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉ.3 గంటల వరకు బార్లు ఓపెన్!

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను..

Liquor Shops: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉ.3 గంటల వరకు బార్లు ఓపెన్!

Updated on: Jul 06, 2021 | 1:17 PM

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త విధానంలో కొన్ని సంస్కరణలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం.. హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. అలాగే కొనుగోలుదారులు నేరుగా వెళ్లి లిక్కర్ కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.

విదేశీ టూరిస్టులు ఎక్కువగా సందర్శించే నగరాల్లో ఢిల్లీ ప్రపంచంలో 28వ స్థానంలో ఉందని పాలసీ పేర్కొంది. అలాగే రాష్ట్రానికి ఎక్సైజ్ ముఖ్యమైన ఆదాయ వనరు అని తెలిపింది. ఆదాయాన్ని పెంచడానికి, లిక్కర్ మాఫియాను నివారించేందుకు ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. మద్యం సేవించేందుకు చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలుగా ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే లిక్కర్ షాపులను ఇకపై మూతపడనున్నాయి. ప్రైవేటు షాపులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Also Read: ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం.? ఎప్పటినుంచంటే.!

Loading...
Unable to load recommendations.
Follow Us