ఢిల్లీలో ప్రతిరోజూ సగటున 300 మందికి పైగా కోవిడ్ రోగులు మరణిస్తున్నారు. సోమవారం 350 మంది రోగులు మరణించగా.. నిన్న 357 మంది, ఈ నెల 24 న 348 మంది మృత్యుబాట పట్టారు. సగటున ప్రతి రోజూ 304 మంది మృతి చెందుతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇంచుమించు ప్రతి దినం ఓ శ్మశాన వాటికకి 60 నుంచి 70 మృతదేహాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఊహించుకోవచ్చునని వారు చెప్పారు. దీంతో కొత్త స్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నిర్మాణం త్వరగా జరగాలని మృతుల బంధువులు కోరుతున్నారని, అయితే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వారు చెప్పారు. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటుందని తాము ఊహించలేదన్నారు. తాజాగా నగరంలో 22,933 కేసులు నమోదయ్యాయి,
అటు ఇళ్లలో ఉన్నా ప్రజలు మాస్కులు ధరించడం ప్రారంభించాలని కేంద్రం ప్రకటించింది. ఇది ముందు జాగ్రత్త చర్య మాత్రమే అని తెలిపింది. మరోవైపు న్యూయార్క్-ఢిల్లీ విమానం నుంచి సోమవారం 328 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు రవాణా అయ్యాయని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. మంగళవారం కూడా మరికొన్ని రావచ్చునని ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇండియాకు వెంటనే అవసరమైన సహాయం చేస్తామని అమెరికా ప్రకటించిన విషయం గమనార్హం,. ఇందులో భాగంగా మొదటి విడతగా ఇవి వాచినట్టు తెలుస్తోంది. ఇండియాలో కోవిడ్ సృష్టిస్తున్న పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సహాయ పడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి, వీటిలో యూకే, సింగపూర్ తదితర దేశాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: లాక్ డౌన్ విధింపు, ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు
లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ