‘నా కొడుకు మంచోడు’.. వెనకేసుకొచ్చిన షార్జీల్ ఇమామ్ తల్లి

| Edited By: Anil kumar poka

Jan 27, 2020 | 2:19 PM

జె ఎన్ యు మాజీ విద్యార్ధి షార్జీల్ ఇమామ్ తన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో అతని తల్లి అఫ్ షాన్ రహీం  తనకొడుకును వెనకేసుకొచ్చింది. పోలీసులు, అధికారులు తనను, తన కుటుంబాన్ని బెదిస్తున్నారని, వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. నా కుమారుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అతను చెప్పిన మాటలకు, మీడియాలో వచ్చిన వార్తలకు దాదాపు పొంతన లేదు అని ఆమె పేర్కొంది. అయినా తమకు వేధింపులు తప్పడంలేదని ఆమె వాపోయింది. తాము చాలా పేదవారమని, […]

నా కొడుకు మంచోడు.. వెనకేసుకొచ్చిన షార్జీల్ ఇమామ్ తల్లి
Follow us on

జె ఎన్ యు మాజీ విద్యార్ధి షార్జీల్ ఇమామ్ తన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో అతని తల్లి అఫ్ షాన్ రహీం  తనకొడుకును వెనకేసుకొచ్చింది. పోలీసులు, అధికారులు తనను, తన కుటుంబాన్ని బెదిస్తున్నారని, వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. నా కుమారుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అతను చెప్పిన మాటలకు, మీడియాలో వచ్చిన వార్తలకు దాదాపు పొంతన లేదు అని ఆమె పేర్కొంది. అయినా తమకు వేధింపులు తప్పడంలేదని ఆమె వాపోయింది. తాము చాలా పేదవారమని, చట్టం పట్ల తమకెంతో గౌరవం ఉందని తెలిపిన ఆఫ్ షాన్ రహీం.. ఎలాంటి విచారణకైనా పోలీసులకు సహకరిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె బీహార్ లోని కాకో గ్రామంలో ఉంది. జెహానాబాద్ పోలీసులు ఆదివారం ఇమామ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసి.. అతని కుటుంబ సభ్యుల్లో కొందరిని విచారించడమే గాక.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇమామ్ ఇంట్లో లేడు. అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈనెల 16న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఇమామ్.. అస్సాంను భారత భూభాగంనుంచి వేరు చేయాలనీ. అక్కడి నిర్బంధ శిబిరాల్లో బెంగాలీలు, హిందువులు, ముస్లిములను హతమారుస్తున్నారని వ్యాఖ్యానించాడట.. పైగా.. తాను లక్ష మంది ప్రజలను సమీకరించగలనని, దీంతో ఆ రాష్ట్రాన్ని శాశ్వతంగా కాకపోయినా.. మరికొన్ని నెలల్లో ఈ దేశ భూభాగం నుంచి వేరు చేయవచ్చునని అతగాడు తన ప్రసంగంలో పేర్కొన్నట్టు విదలయిన ఓ క్లిప్ సంచలనం రేపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణపై ఢిల్లీ పోలీసులు ఇతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా.. అస్సాం పోలీసులు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. పైగా దేశద్రోహ కేసు కూడా ఇమాంపై దాఖలైంది. గత ఏడాది డిసెంబరు 13 న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో కూడా షార్జీల్ ఇమామ్ ఇలాగే ప్రసంగాలు చేశాడట.