Rahul Gandhi: ఈడీ ముందుకు సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ నేతల ధర్నా.. రాహుల్‌ గాంధీ అరెస్టు

|

Jul 26, 2022 | 2:01 PM

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ మరో సారి విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తెలుపడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆదోళనలను..

Rahul Gandhi: ఈడీ ముందుకు సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ నేతల ధర్నా.. రాహుల్‌ గాంధీ అరెస్టు
Follow us on

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ మరో సారి విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తెలుపడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆదోళనలను మరింత ఉధృతం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు కాంగ్రెస్‌ ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజయ్‌చౌక్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేశారు. దీంతో పోలీసులతో రాహుల్‌ గాంధీ వాగ్వివాదానికి దిగారు. ధర్నా చేయడానికి తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్‌ పోలీసులను ప్రశ్నించారు. మోడీపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ దేశాన్ని రాజులాగా పాలిస్తు్న్నారని ఆరోపించారు. తమపై కక్ష్యపూరింగా మోడీ సర్కార్‌ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

 

ఇవి కూడా చదవండి


పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సభ్యులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపడంతో రాజ్యసభ, లక్‌సభ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ లోపల కూడా నిరసన చేపట్టారు. ప్రభుత్వ ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపడం చేస్తోందని ఆరోపించారు.

 

తమకు నిరసన తెలిపే హక్కు ఉన్నా..పోలీసులు అడ్డుకోవడం ఏంటని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.
ఇక సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత వారం రోజుల కిందట మొదటిసారిగా విచారించగా, ఇప్పుడు రెండో సారి హాజరు కావాలని ఈడీ సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి