Vistara Flight: టేకాఫ్ అయిన విమానం.. సాంకేతిక లోపంతో వెంటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విస్తారా విమానం బోయింగ్ 737లో.. కాక్‌పిట్‌కు కుడి వైపున విజిల్ శబ్దాలు రావడంతో సోమవారం మధ్యలోనే తిరిగి వచ్చిందని డీజీసీఏ (Directorate General of Civil Aviation) అధికారులు తెలిపారు. విమానాన్ని ప్రాథమికంగా పరిశీలించగా.. ఎలాంటి లోపం కనిపించలేదని ఈ ఘటనపై విచారణకు డీసీజీఏ ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరిన B737-8 విమానం.. 40 నిమిషాల్లో తిరిగి చేరుకుందని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత పైలట్‌ను విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించుకున్నాడని పేర్కొంది. చిన్న సాంకేతిక సమస్యతో ఇలా జరిగిందని పేర్కొంది. లైవ్ ఎయిర్‌క్రాఫ్ట్ కదలికలను ట్రాక్ చేసే యాప్ అయిన ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. ఈ సమయంలో విమానం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. కాగా, ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ విమానం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా కంపెనీ, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..