Delhi Metro : ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఢిల్లీ మెట్రో డ్రైవర్ లేని ట్రైన్‌ను నడపనుంది. ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు.
దేశంలోనే మొదటి డ్రైవర్ లేని రైలు ఢిల్లీ నుంచి మెజెంటా లైన్‌లో నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఢిల్లీ మెట్రో 18 ఏళ్ల సందర్భంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ మెట్రో డిసెంబర్ 25న, 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.