Zomato: ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏమి చేశాడంటే..

|

Jun 04, 2022 | 4:17 PM

Chicken In Coffee: ఈ రోజుల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మంది వాటనే వినియోగిస్తున్నారు. కానీ.. కొంత మందికి వింత, షాకింత అనుభవాలు ఎదురవుతున్నాయి.

Zomato: ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏమి చేశాడంటే..
Coffee
Follow us on

Chicken In Coffee: ఈ రోజుల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మంది వాటనే వినియోగిస్తున్నారు. కానీ.. కొంత మందికి వింత, షాకింత అనుభవాలు ఎదురవుతున్నాయి. అలాంటిదే ప్రముఖ డెలివరీ యాప్ జొమాటోలో ఆర్డర్ చేయటం వల్ల ఢిల్లీకి చెందిన సుమిత్ అనే వ్యక్తి ఎదుర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. థర్డ్ వేవ్ ఇండియా నుంచి జొమాటో ద్వారా కాఫీ ఆర్డర్ చేశాడు. దానిని సుమిత్, అతని భార్య తాగారు. కానీ.. కాఫీ చివరికి వచ్చే సమయానికి అందులో ఒక చికెన్ ముక్క కనిపించటంతో వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పైగా తన భార్య వెజిటేరియన్స్ కావటంతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు సదరు వినియోగదారుడు ట్విట్టర్ వేధికగా తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ వ్యవహారంలో జొమాటో, థర్డ్ వేవ్ ఇండియాలను టాగ్ చేశాడు.

ఈ ఘటనతో షాక్ తిన్న సుమిత్ ఈ రోజుతో మీతో ఉన్న బంధం అధికారికంగా ముగిసిందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన డెలివరీ దిగ్గజం అసౌకర్యానికి క్షమాపణ కోరింది. దీనికి బదులుగా ప్రో మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తామని వెల్లడించింది. కానీ దానికి సదరు వినియోగదారుడు ససేమిరా అన్నాడు. తాను ధనవంతుడినేనని తనకు ఈ ఆఫర్ అవసరం లేదంటూ తిరస్కరించాడు. ఈ సంభాషణను సైతం అతను ట్వీట్ లో ఉంచాడు. దీనిని చూసిన నెటిజన్లు జొమాటో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు మెషిన్ మేడ్ కాఫీలో ఇలా చికెన్ రావటం కావాలని చేసిన పనేనంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.