Watch Video: ఏం తెలివిరా బాబు.. బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దూబాయ్‌ నుంచి వచ్చిన ఒక ప్రయాణికులు బంగారాన్ని అక్రమంగా తరలించిన తీరు కస్టమ్స్‌ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఆ ప్రయాణికుడు బంగారన్ని ఏకంగా వాటర్ బాటిల్‌ క్యాప్‌ రూపంలో తీసుకొచ్చాడు. కానీ కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అధికారులను అతడి నుంచి రూ.20లక్షల విలువైన 170 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Watch Video: ఏం తెలివిరా బాబు.. బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే!
Gold Smuggling

Updated on: Oct 26, 2025 | 3:41 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి AI-996 విమానంలో వచ్చిన ఒక భారతీయ ప్రయాణీకుడి నుండి 170 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఫ్లైట్‌ దిగిన తర్వాత ఆ ప్రయాణీకుడిని ఎయిర్‌పోర్టులోంచి గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుమానం వచ్చిన అధికారులు అతన్నిఅడ్డగించారు. స్కానర్‌తో అతని దగ్గరున్న లగేజ్‌ను చెక్‌ చేయగా అందులో అనుమానాస్పద చిత్రాలను అధికారులను గమనించారు. దీంతో అతని బ్యాగ్‌ను తీసి తనిఖీ చేశారు. అప్పుడు బాటిల్‌ టాప్‌ రూపంలో అతను బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో బాటిల్‌ క్యాప్‌లో ఉన్న 170 గ్రామలు బంగారాన్ని స్వాధీనం చేసుకన్నారు.

పట్టుబడిన బంగారం విలువ మార్కెట్‌లో రూ.20లక్షలు వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కస్టమ్స్ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు బంగారం దాచి తీసుకొచ్చి దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.