Big Breaking : కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు..!

| Edited By:

Mar 02, 2020 | 7:16 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ.

Big Breaking : కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు..!
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ.. రేపు అమలు చేయబోయే ఉరిశిక్షను వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం సాయంత్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 3వ తేదీ ఉదయం 6.00 గంటలకు నలుగురు దోషులకు పడాల్సిన ఉరిశిక్ష.. మరోసారి వాయిదా పడింది. అయితే కొత్త తేదీలపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై నిర్భయ తల్లి ఆశదేవి అసహనం వ్యక్తం చేశారు. దోషులకు అన్ని వ్యవస్థలు అనుకూలంగా ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు.

కాగా.. అంతకు ముందు.. నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీం రిజెక్ట్ చేసింది. అయితే ఆ వెంటనే పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నారు. దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ ఈ మెర్సీ పిటిషన్‌ను వేశారు. దీంతో రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో.. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ నలుగురు దోషులను ఉరితీయోద్దంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు.. మూడోసారి వాయిదా పడింది.