Delhi: ఢిల్లీలో ఒక వైపుకు ఒరిగిపోయిన భవనం..అధికారులు ఏం చేశారంటే..

కాలనీలోని అనేక భవనాలు వంగి ఉన్నాయని, అవి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాబట్టి అటువంటి భవనాలను అధికారులు ఖాళీ చేయించారని అని ఆయన అన్నారు. మరోసారి సర్వే బృందం ఆ స్థలాన్ని సందర్శిస్తుందని, ఇంజనీర్లు, అధికారులు ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.

Delhi: ఢిల్లీలో ఒక వైపుకు ఒరిగిపోయిన భవనం..అధికారులు ఏం చేశారంటే..
Building Tilted To One Side

Updated on: May 17, 2025 | 8:36 PM

ఢిల్లీలోని షాదరాలో బిహారీ కాలనీలో ఓ భవనం ఒక వైపు ఒరిగిపోయింది. దీంతో ఆ భవనంపై ఎంసీడీ అధికారులు నోటీసు అతికించారు. ప్రమాదాన్ని నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని అక్కడి వారికి సూచించారు. సమీపంలోని ఇతర భవనాల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సహాయంతో భవనాన్ని ఖాళీ చేయించి, భవనానికి సపోర్ట్‌గా జాక్‌లు ఏర్పాటు చేశారు. భవనం అలా ఒరిగిపోడానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్థానికులకు ధైర్యం చెప్పారు.

అయితే, ఈ భవనం అంత సురక్షితం కాదని, తర్వాత దానిని కూల్చివేస్తామని అధికారులు వెల్లడించారు. ఐదు నుండి ఆరు అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తున్నామని MCD షాహ్దారా సౌత్ జోన్ అధ్యక్షుడు సందీప్ కపూర్ తెలిపారు. వీటిలో చాలా వరకు వంగిపోయినవి, శిథిలావస్థలో ఉన్నవి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అవి కూలిపోతే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవిస్తుందని చెప్పారు. అలాంటి భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అవసరమైన చోట నోటీసులు జారీ చేస్తున్నారు. సురక్షితం కానివిగా తేలితే, వాటిని సీలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిహారీ కాలనీలోని అనేక భవనాలు వంగి ఉన్నాయని, అవి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాబట్టి అటువంటి భవనాలను అధికారులు ఖాళీ చేయించారని అని ఆయన అన్నారు. మరోసారి సర్వే బృందం ఆ స్థలాన్ని సందర్శిస్తుందని, ఇంజనీర్లు, అధికారులు ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..