Delhi Lockdown News: కోవిడ్ ఉధృతి…దేశ రాజధానిలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేజ్రీవాల్

|

Apr 02, 2021 | 5:41 PM

Delhi Lockdown News: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల గ్రాఫ్ పైపైకి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసుల కట్టడికి అక్కడ లాక్‌డౌన్ విధించే అవకాశముందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Delhi Lockdown News: కోవిడ్ ఉధృతి...దేశ రాజధానిలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేజ్రీవాల్
Delhi CM Arvind Kejriwal
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసుల గ్రాఫ్ పైపైకి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసుల కట్టడికి అక్కడ లాక్‌డౌన్ విధించే అవకాశముందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రభుత్వాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కరోనా కేసుల ఉధృతికి అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్…దేశ రాజధానిలో లాక్‌డౌన్ విధించే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టంచేశారు. కోవిడ్ ఉధృతిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని…గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 3,583 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగో వేవ్ నడుస్తోందని చెప్పిన కేజ్రీవాల్…కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా పట్ల ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అవసరమని భావిస్తే ఢిల్లీ ప్రజలతో ముందుగా చర్చించిన తర్వాతే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతానికి మాత్రం లాక్‌డౌన్ పెట్టే యోచనలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్19 వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..Covid Update News: కరోనా ప్రమాద ఘంటికలు…ఆ నగరంలో హోటళ్లు బంద్..రాత్రిపూట కర్ఫ్యూ

ఆదిలాబాద్ రంజాన్లకు భలే గిరాకీ.. నీటిని చల్లబరచడమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో బెటర్‌.. ఏంటో తెలుసుకోండి..