
ఒక భారీ పేలుడు జరగాలి. ఆ పేలుడు ఎలా ఉండాలంటే.. ‘నెవర్ బిఫోర్’ అన్నట్టుగా కనిపించాలి. బట్.. వేళ్లు మాత్రం పాకిస్తాన్‌వైపు చూపించకూడదు. ఢిల్లీ బ్లాస్ట్ వెనక ఉగ్రవాదుల వ్యూహం ఇదేనా? ఎందుకీ డౌట్ అంటే. ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా, చేసింది పాకిస్తానే అని తెలిసినా.. బ్రహ్మోస్ మిస్సైల్స్ లేస్తాయ్. దీనిపై గతంలోనే హెచ్చరించింది భారత్. అటు చూస్తే.. ఇండియన్ ఆర్మీ నుంచి ఇంకొక్క దాడిని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. సో, భారత్‌లో ఉగ్రదాడి చేయాలి… కాని పాకిస్తాన్‌పై అటాక్ జరక్కూడదు. అంటే ఏంచేయాలి? ఉగ్రదాడే కానీ ఏ ఉగ్రవాద సంస్థ చేసిందో అధికారికంగా తెలియకూడదు. అందుకేనా డాక్టర్లతో ఉగ్రకుట్రకు ప్లాన్ చేయించింది? మనందరికీ తెలుసు.. భారత్‌లో ఉగ్రదాడి జరిగిందంటే ఆ టెర్రిరిస్ట్ గ్రూప్ పుట్టుక పాకిస్తానే అయి ఉంటుందని. సో, ఫలానా ఉగ్ర సంస్థ అని తెలిసినా చాలు. పాకిస్తాన్‌కు ఈసారి దబిడిదిబిడే. అందుకే, ఇప్పటి వరకు ఏ టెర్రర్ గ్రూప్ కూడా తామే చేశామని చెప్పుకోలేదు. మరి ఎవరు చేశారు? ఇదొక కొత్తరకం మోడస్ ఆఫ్ ఆపరాండీ. పాకిస్తాన్‌కు ఏమీ కాకుండా, పాక్ వైపు వేలెత్తి చూపకుండా భారత్‌పై దాడి చేయడమే సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది. అందులోనూ ఢిల్లీ బ్లాస్ట్‌కు వాడిన ఎక్స్‌ప్లోజివ్ గతంలో ఎక్కడా వాడినట్టు కనిపించలేదు? ఇంతకీ ఏంటా పేలుడు పదార్థం? ఢిల్లీ కారు బాంబ్ వెనక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో...