Beat The Heat: ఎండలోనూ చలిపుట్టిస్తోన్న ఆటో.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

|

May 04, 2022 | 8:03 PM

Beat The Heat: దేశంలో గత కొన్ని వారాలుగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు వేడి గాలులు చిన్నాపెద్దా అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో అయితే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.

Beat The Heat: ఎండలోనూ చలిపుట్టిస్తోన్న ఆటో.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Beat The Heat
Follow us on

Beat The Heat: దేశంలో గత కొన్ని వారాలుగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు వేడి గాలులు చిన్నాపెద్దా అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో అయితే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ వేడిగాలులకు అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన వాహనం లోపల ప్రయాణించేవారికి చల్లగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. అతని ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అతని ఆటో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆటో డ్రైవర్ మహేంద్ర కుమార్ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఎండ సమయంలో ఎంత అవసరమున్నా ఇప్పుడు బయటకు వెళ్లటం అవసరమా అని అనుకుంటాం. ఏ ఆటోనో, కారో ఎక్కాలన్నా వద్దులే చల్లబడ్డాక బయటకు పోదామని అనేక మంది పనులను వాయిదా వేసుకుంటుంటారు. కానీ.. ఎండలోనూ తన ఆటో చల్లగా ఉంటుందని ఒక దిల్లీ ఆటోవాలా అంటున్నాడు. అసలు మ్యాటర్ ఏమిటంటే.. వేసవిలో తన ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చల్లగా ఉండేందుకు అనువుగా ఆటో కప్పుపై అతను పచ్చని మొక్కలను ఏర్పాటు చేశాడు. దిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల తాకినప్పటికీ.. తన ఆటోలో ప్రయాణించేవారికి మాత్రె చల్లగానే ఉంటుందని సదరు ఆటో డ్రైవర్ అంటున్నాడు.

సుమారు రెండేళ్ల కిందటం వేసవి కాలంలో తనకు ఈ ఆలోచన వచ్చింది. దీంతో  ఆటోకప్పుపై కొన్ని మొక్కలను పెంచితే బాగుంటుందని అతను భావించాడు. అనుకుందే తడవున దానిని అమలు చేశాడు కూడా. దీని కారణంగా అతని ఆటోలో ప్రయాణించే వారికి ఎండవేడి నుంచి ఉపశమనం కలుగుతోందని చెప్పాడు. దీనికి తోడు సదరు ఆటో డ్రైవర్ ఆటో లోపల రెండు మినీ కూలర్లు, ఫ్యాన్లు కూడా అమర్చాడు. ఇలా చేయటం వల్ల ప్రయాణికులకు సహజమైన ఏసీలో ఉన్న అనుభూతి కలుగుతోందని చెప్పాడు. ప్రయాణీకులు రైడ్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నారని, దీనికి గాను అదనంగా చెల్లించేందుకు వారు ఎటువంటి ఇబ్బంది పడటం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీ చదవండి..

Jack Ma: చైనా వ్యాపారవేత్త ‘జాక్ మా’ అరెస్ట్? కుప్పకూలిన అలీబాబా కంపెనీ షేర్లు.. పూర్తి వివరాలు

Save Birds: పక్షుల దాహార్తిని తీర్చే సూపర్ ఐడియా ఇది.. సెల్యూట్ అంటున్న యానిమల్ లవర్స్..