ఇక కుమ్ముడే.. తొలి రఫేల్‌ను అందుకున్న రక్షణ మంత్రి

భారత్‌ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన మరో అస్త్రం సమకూరింది. తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్రాన్స్‌లో మంగళవారం అధికారికంగా స్వీకరించారు. 87వ ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా రఫేల్ యుద్ద విమానాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రక్షణ మంత్రి తెలిపారు. దసరా పర్వదినం రోజున రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ కావడం సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. రఫేల్ జెట్ సరఫరాకు శ్రీకారం చుట్టుడంతో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్టయ్యిందని పేర్కొన్నారు. రఫేల్‌జెట్‌లో […]

ఇక కుమ్ముడే.. తొలి రఫేల్‌ను అందుకున్న రక్షణ మంత్రి

Edited By:

Updated on: Oct 08, 2019 | 7:13 PM

భారత్‌ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన మరో అస్త్రం సమకూరింది. తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్రాన్స్‌లో మంగళవారం అధికారికంగా స్వీకరించారు. 87వ ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా రఫేల్ యుద్ద విమానాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రక్షణ మంత్రి తెలిపారు. దసరా పర్వదినం రోజున రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ కావడం సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. రఫేల్ జెట్ సరఫరాకు శ్రీకారం చుట్టుడంతో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్టయ్యిందని పేర్కొన్నారు. రఫేల్‌జెట్‌లో ప్రయాణించాలని ఉత్సాహంగా ఉందని, రఫేల్‌ జెట్‌లు భారత్‌ వైమానిక దళాన్ని బలోపేత చేయనున్నాయని, వాయుసేనలో భారత్‌ బలోపేతమై శాంతిభద్రతల బలోపేతానికి మార్గం మరింత సుగమం కానుందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. తొలుత రఫేల్‌ను స్వీకరిస్తూ రాజ్‌నాథ్‌సింగ్ దసరా సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు. రఫేల్‌ను స్వీకరించే సమయంలో రక్షణ మంత్రి వెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కూడా ఉన్నారు.