నేపాల్‌లో వరద భీభత్సం… 43మంది మృతి

నేపాల్‌ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 43 మంది మరణించారు. మరో 24 మంది గల్లంతయ్యారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతకొన్ని రోజుల నుంచి నేపాల్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వాగులు, వంకలు పొంగి, […]

నేపాల్‌లో వరద భీభత్సం... 43మంది మృతి

Updated on: Jul 14, 2019 | 12:56 PM

నేపాల్‌ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 43 మంది మరణించారు. మరో 24 మంది గల్లంతయ్యారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గతకొన్ని రోజుల నుంచి నేపాల్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితి చేయి దాటకుండా పూర్తి సహయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 6000 మంది ఈ వరదల వల్ల ఇండ్లను కోల్పోయి..నిరాశ్రయులగా మారారని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు.