Viral Video: పాముల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడే పాములు ప్రత్యక్షమవుతుంటాయి. పాము కాటుకు గురై చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా అనేకం చోటు చేసుకుంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాములతో కొందరు చేసే విన్యాసాలు నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తుంటాయి. కానీ, పాము పేరు వింటేనే చాలా మందికి హడల్. ఇక పాము కనిపిస్తే చాలు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. అలాంటి పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ బాలిక బ్యాగ్‌లోకి పాము చొరబడి భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగినట్టుగా తెలిసింది.
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లోని బదోని స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. ఉమా రజక్ అనే 10వ తరగతి బాలిక స్కూల్ వేసుకుని రోజూ మాదిరిగానే బ్యాగ్ వేసుకుని బయల్దేరింది. మార్గమధ్యలో బాలిక తన బ్యాగ్‌లో ఏదో కదులుతున్నట్లు గమనించింది. అలాగే, స్కూల్ వరకు వెళ్లిపోయింది. బ్యాగ్‌లో కదలికలు మరింత ఎక్కువ కావటంతో తన టీచర్‌తో చెప్పింది. దాంతో అనుమానం వచ్చిన టీచర్ బ్యాగు తెరిచి పుస్తకాలన్నీ బయటకు తీయగా అందులో నాగుపాము ప్రత్యక్షమైంది. నాగుపాము దాడి చేయకపోవడంతో ఉపాధ్యాయుడు, బాలిక ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు.
कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza
— Karan Vashistha BJP ?? (@Karan4BJP) September 22, 2022
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నాగుపాము విషం ఒక్క కాటుతో 20 మందిని చంపేంత శక్తివంతమైనది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి