police brutality on dalit youth….దళితుడికి పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు, మంచి నీరు అడిగితే ఖాకీలు ఏం చేశారంటే ..? కర్నాటకలో దారుణం

కర్నాటక లోని చిక్కమగళూరులో ఓ దళితుడిని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు.పునీత్ అనే ఈ యువకుడు పోలీస్ స్టేషన్ లో తాను అనుభవించిన ఖాకీల క్రౌర్యం గురించి రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ కి లేఖ రాస్తూ..

police brutality on dalit youth....దళితుడికి పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు, మంచి నీరు అడిగితే  ఖాకీలు  ఏం చేశారంటే ..?  కర్నాటకలో దారుణం
Karnataka Cop

Edited By: Anil kumar poka

Updated on: May 23, 2021 | 4:03 PM

కర్నాటక లోని చిక్కమగళూరులో ఓ దళితుడిని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు.పునీత్ అనే ఈ యువకుడు పోలీస్ స్టేషన్ లో తాను అనుభవించిన ఖాకీల క్రౌర్యం గురించి రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ కి లేఖ రాస్తూ..తనకు న్యాయం చేయాలని కోరాడు. తన పట్ల క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని అభ్యర్థించాడు. ఈ టౌన్ లోని గోణిబీడు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10 న తనను పోలీసులు పెట్టిన చిత్రహింసలను పునీత్ వివరించాడు. తను ఒక మహిళతో మాట్లాడుతున్నానని ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్టేషన్ కి తీసుకువెళ్లి కాళ్ళు, చేతులు కట్టివేసి లాఠీలతో ఇష్టం వచ్చినట్టు బాదారని, తన దళిత కులాన్ని అవమానిస్తూ దుర్భాషలాడారని ఆ యువకుడు తన లేఖలో తెలిపాడు. దాహం వేస్తోందని, మంచినీరు కావాలని తాను కోరగా, ఓ వ్యక్తి చేత తనపై మూత్రం పోయాలని ఆదేశించారని, అదే తాగాలని ఒత్తిడి చేశారని పునీత్ వెల్లడించాడు. గత్యంతరం లేక వారి ఆదేశాలను పాటించానని అన్నాడు. ఇతని ఫిర్యాదుపై చిక్ మగుళూరు ఎస్పీ సదరు పోలీసుల చర్యపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ని మరి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఆ ఎస్ఐ మీద కేసు కూడా పెట్టారు.

అయితే పునీత్ ని ఈ పోలీస్ స్టేషన్ కి అప్పగించి..అతడిపై కఠిన చర్య తీసుకోవాలని కోరిన గ్రామస్థుల మాటేమిటని పునీత్ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో

వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.