Viral: ఇలా ఎలా వస్తాయ్‌ రా బాబు ఐడియాలు.. ఒకడేమో ప్యాంట్లో.. మరొకడు ఏకంగా..

|

May 04, 2023 | 9:08 AM

స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో గుడ్డి ఐడియాలతో.. విదేశాల నుంచి భారత్ కు అక్రమ రవాణా చేయాలని స్మగ్లర్లు ప్లాన్ రచిస్తుంటారు.. అలాంటి వారికి కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిస్తుంటారు.

Viral: ఇలా ఎలా వస్తాయ్‌ రా బాబు ఐడియాలు.. ఒకడేమో ప్యాంట్లో.. మరొకడు ఏకంగా..
Crime News
Follow us on

స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో గుడ్డి ఐడియాలతో.. విదేశాల నుంచి భారత్ కు అక్రమ రవాణా చేయాలని స్మగ్లర్లు ప్లాన్ రచిస్తుంటారు.. అలాంటి వారికి కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ అంతర్జాతీయ విమానశ్రయాల్లో తరచూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా.. ఇద్దరు శరీరంలో బంగారం దాచుకుని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. వీరిద్దరి ఐడియాలు చూసి అధికారులే షాకయ్యారు. కొచ్చి విమానాశ్రయంలో రెండు సందర్భాల్లో.. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) 1.4 కోట్ల రూపాయల విలువైన 3038.79 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

DRI, AIU అధికారుల సమాచారం ప్రకారం.. మలేషియా నుంచి కొచ్చి విమానాశ్రయానికి AK 039 విమానంలో వచ్చిన ప్రయాణికుడిని కొచ్చి కస్టమ్స్ బ్యాచ్ అధికారులు గ్రీన్ ఛానల్ వద్ద అడ్డగించారు. అయితే, సదరు ప్రయాణికుడిని పరీక్షిస్తున్నప్పుడు, అతని శరీరంలో 1199.34 గ్రాముల బరువున్న బంగారపు గుళికలను, అలాగే అతను ధరించిన జీన్స్ నడుము భాగంలో పేస్ట్ రూపంలో దాచిన 584.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ షమీర్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రెండవ సందర్భంలో.. కొచ్చి కస్టమ్స్ AIU బ్యాచ్ అధికారులు చేసిన ప్రొఫైలింగ్ ఆధారంగా, దుబాయ్ నుండి EK532 విమానంలో కొచ్చి విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడిని పరీక్షించగా.. అతని శరీరం లోపల కుహరం భాగంలో దాచిపెట్టిన మొత్తం 1254.70 గ్రాముల బరువున్న 4 గుళికల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని మలప్పురం జిల్లాకు చెందిన షరీఫ్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..