ముంబైలో కంగనా శారీస్ కు యమ క్రేజ్ !

కరీనా.. కత్రీనా..ఇప్పుడు కంగనా... వీరంతా బాలీవుడ్‌ని ఓ దుమ్ము దులిపేసిన అందాల భామలు. ఇప్పుడు కంగనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కంగనా క్రేజ్‌ను కొందరు వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 10:23 am, Sun, 13 September 20
ముంబైలో కంగనా శారీస్ కు యమ క్రేజ్ !

కరీనా.. కత్రీనా..ఇప్పుడు కంగనా… వీరంతా బాలీవుడ్‌ని ఓ దుమ్ము దులిపేసిన అందాల భామలు. ఇప్పుడు కంగనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమె కట్టు..బొట్టుతోపాటు కాంట్రవర్శీ అదే రేంజ్‌లో ఉంటోంది. మణికర్ణిక మూవీతో యమా పాపులర్‌ ఐనా ఈ బాలీవుడ్‌ బామ, సుశాంత్‌ సూసైడ్‌ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంతో విభేదించడంతో భారీగా క్రేజ్‌ పెరిగిపోయింది. కంగనాకు ఉన్న క్రేజ్‌ను కొందరు వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

తెలుగువారికి చందన శారీస్ తెలుసు. బొమ్మన శారీస్ కూడా తెలుసు. అయితే, ఇప్పుడు కొత్త చీరలు వచ్చాయి. అవే కంగనా శారీస్. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంతో విభేదిస్తున్న కంగనా రనౌత్‌కు దేశవ్యాప్తంగా భారీగా క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కంగనా చీరలు తయారు చేశారు. మణికర్ణిక సినిమాలో కంగనా రనౌత్ ఫొటోను ప్రింట్ చేశారు. ‘ఐ సపోర్ట్ కంగనా రనౌత్’ అంటూ ప్రింట్ చేశారు. కంగనా రనౌత్ బ్యాక్ గ్రౌండ్‌లో వినాయకుడి బొమ్మను ముద్రించారు.

గుజరాత్‌లోని సూరత్ దేశంలో ప్రముఖ వస్త్ర వ్యాపార కేంద్రం. దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి వస్త్రాలు సరఫరా అవుతుంటాయి. గతంలో నరేంద్ర మోదీ, ప్రియాంకా చోప్రా, స్వచ్ఛభారత్, కరోనా జాగృతి అభియాన్ పేరుతో కూడా ఇక్కడి వ్యాపారులు చీరలు ప్రింట్ చేశారు.

 

ఇక ముంబైలో కంగనా శారీస్‌కు యమా క్రేజ్‌ ఏర్పడింది. పలు దుకాణాల ముందు ఆమె కటౌట్లే కనిపిస్తున్నాయట. మహిళలోకం కూడా కంగనా కొత్త డిజైన్‌ శారీస్‌ను డిస్కౌంట్‌ లేకుండా కొనడానికి ఎగబడుతున్నారట. మరీ…కంగననా…మజాకా.!