రెండోసారి కరోనా సోకితే డేంజరే!

|

Oct 13, 2020 | 12:16 PM

ఒకసారి కరోనా వైరస్‌ సోకిన వారికి మళ్లీ ఆ మహమ్మారి అంటుకోదన్న గ్యారంటీ ఏమీ లేదు.. అసలు అలాంటి భ్రమలు వీడండి అని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన డాక్టర్లు..

రెండోసారి కరోనా సోకితే డేంజరే!
Follow us on

ఒకసారి కరోనా వైరస్‌ సోకిన వారికి మళ్లీ ఆ మహమ్మారి అంటుకోదన్న గ్యారంటీ ఏమీ లేదు.. అసలు అలాంటి భ్రమలు వీడండి అని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన డాక్టర్లు.. ఇందుకు సంబంధించి పూర్తి పరిశోధన వివరాలరె లాన్‌సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.. కరోనా వైరస్‌ రెండోసారి సోకితే మాత్రం తీవ్రమైన వైరస్‌ లక్షణాలు నమోదవుతాయని వైద్యులు అంటున్నారు. ఒకసారి వైరస్‌ నుంచి కోలుకుంటే మళ్లీ రాదని అనుకోవడానికి వీల్లేదని చెబుతున్నారు. నెవడాకు చెందిన పాతికేళ్ల పేషంట్‌కు రెండుసార్లు భిన్నమైన కరోనా వైరస్‌లు సోకాయని, అది కూడా 48 రోజుల వ్యవధిలోనేనని చెప్పిన డాక్టర్లు రెండోసారి మాత్రం పేషంట్‌కు ఆక్సిజన్‌ సపోర్ట్‌ చికిత్స చేయాల్సి వచ్చిందని అన్నారు. లాన్‌సెట్ జర్నల్‌లో రీ ఇన్‌ఫెక్షన్‌ కేసులకు సంబంధించి చాలా వివరాలను పొందుపరిచారు. బెల్జియం, హాలెండ్‌, హాంగ్‌కాంగ్‌, ఈక్వెడార్‌ వంటి దేశాలలో కూడా రీ ఇన్‌ఫెక్షన్‌ కేసులు చాలానే నమోదయ్యాయని జర్నల్‌ తెలిపింది..