Char Dham Yatra: ఆలయాలపై కరోనా ఎఫెక్ట్.. చార్‌ధామ్ యాత్రను రద్దు.. యధావిథిగా నిత్య పూజలు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో పలు దేవాలయంలోని భక్తుల అనుమతిని నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్ర చార్‌ధామ్ యాత్రను రద్దు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.

Char Dham Yatra: ఆలయాలపై కరోనా ఎఫెక్ట్.. చార్‌ధామ్ యాత్రను రద్దు.. యధావిథిగా నిత్య పూజలు
Char Dham Yatra

Updated on: Apr 29, 2021 | 12:45 PM

Char Dham Yatra: కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో పలు దేవాలయంలోని భక్తుల అనుమతిని నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్ర చార్‌ధామ్ యాత్రను రద్దు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తీర్ధ సింగ్ రావత్ ప్రకటించారు. చార్‌దామ్ యాత్రలో బాగంగా కేదారనాధ్, బద్రీనాధ్, గంగోత్రి, యమునోత్రిని భక్తులు దర్శించుకుంటారు. ఏటా లక్షల మంది ఈ యాత్రకు వెళుతుంటారు. ఈ ఏడాది యాత్రను రద్దు చేసిన ప్రభుత్వం.. నాలుగు ఆలయాల్లో పూజారులు.. యధావిథిగా నిత్య పూజలు చేస్తారని ప్రకటించింది. ఇప్పటికే చార్‌ దామ్ యాత్రలో పాల్గొనేందుకు చాలా మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికీ ఫీజులు వెనక్కి చెల్లించనున్నారు.

కోవిడ్ కేసులు పెరగడంతో అటు, హరిద్వార్‌ కుంభమేళాను మద్యలోనే ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. కుంభమేళాలో పాల్గొనేందుకు వేల మంది భక్తులు, సాధువులు, సంతులు రావడంతో కోవిడ్ కేసులు పెరిగాయి. వారం రోజుల్లోనే ఐదువేల మందికి కోవిడ్ సోకడంతో ప్రభుత్వం కుంభమేళాను అర్థాంతరంగా ఆపేసింది. అంతేకాదు, షాహీ స్నాన్ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. కుంభమేళా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా మారిందనే విమర్శలు వచ్చాయి.

సెకండ్ వేవ్‌లో కోవిడ్ కేసులు పెరగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలు, పండగల మీద ఆంక్షలు విధించాయి. శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నారు. శ్రీరామనవమితోపాటు పాటు రంజాన్ ఉత్సవాలు, వేడుకల మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేసులు తగ్గే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Read Also…  Covid-19 Second Wave: భారత్ నుంచి త్వరగా వచ్చేయండి.. దేశస్థులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా

Loading...
Unable to load recommendations.
Follow Us