Covid-19 vaccination: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతోపాటు జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే.. ఈ వయస్సు వారికి వ్యాక్సిన్ (Covid-19 vaccination) అందించడంలో భారత్ మరో ఘనతను సాధించింది. దేశంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్న 50 శాతం యువకులు వ్యాక్సిన్ మొదటి డోసును పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) యువకులను ప్రశంసించారు. 15-18 ఏళ్ల మధ్య వయస్సున్న 50% మంది యువకులు మొదటి డోస్ టీకా తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ రీట్విట్ చేశారు. ‘‘యువత, యువ భారతదేశం మార్గాన్ని చూపుతోంది! ఇది ప్రోత్సాహకరమైన వార్త. మనం ఇదే వేగాన్ని కొనసాగిద్దాం. టీకాలు వేయడం, తీసుకోవడం, అన్ని కరోనా సంబంధిత ప్రోటోకాల్‌లను పాటించడం చాలా ముఖ్యం. మనమందరం కలిసి ఈ మహమ్మారిపై పోరాడదాం..’’ అంటూ ట్విట్ చేశారు.
అంతకుముందు మన్సుఖ్ మాండవియా ట్విట్ చేస్తూ.. భారత్ కోవిడ్‌పై చేస్తున్న పోరాటంలో కీలక రోజని.. 15-18 ఏళ్ల మధ్య ఉన్న మన యువకులలో 50% కంటే ఎక్కువ మంది కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని ట్విట్ చేశారు. టీకా పట్ల మీ ఉత్సాహం ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తోందంటూ ట్విట్ చేశారు. కాగా.. గత 24 గంటల్లో 76 లక్షల కంటే ఎక్కువ మోతాదుల (76,35,229) వ్యాక్సిన్ డోస్‌లను పంపణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు ఉదయం వరకు 158.88 (1,58,88,47,554) కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
Young and youthful India showing the way!
This is encouraging news. Let us keep the momentum.
It is important to vaccinate and observe all COVID-19 related protocols. Together, we will fight this pandemic. https://t.co/RVRri5rFyd
— Narendra Modi (@narendramodi) January 19, 2022
Also Read: