Coronavirus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Apr 12, 2022 | 9:43 AM

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Coronavirus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల నుంచి వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ క్రమంలో సోమవారం కూడా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 796 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటి రేటు 0.20 శాతం ఉంది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 19 ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,37,028 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,710 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 946 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,04,329 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,85,90,68,616 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 15,65,507 టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

4 Days Work Week: వారానికి 4 రోజుల.. రోజుకు 12 గంటల పని.! కంపెనీలు ఏం చెబుతున్నాయంటే?

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?