India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా

India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Coronavirus

Updated on: Nov 17, 2021 | 9:49 AM

India Covid-19 Updates: దేశంలో ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గురువారంతో పోల్చుకుంటే.. శుక్రవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 555 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 1,36,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 274 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1 శాతంగా ఉంది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,26,036 కి చేరగా.. మరణాల సంఖ్య 4,63,245 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,403 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,26,483 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..

కీచకోపాధ్యాయుడు.. స్పెషల్‌ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం

Follow Us